జైలు నుంచే బాబు డైరెక్షన్...భువనేశ్వరి అలా లోకేష్ ఇలా...!

చంద్రబాబు జైలులో ఉన్నా కూడా తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నారు. ములాఖత్ అవుతున్న కుటుంబ సభ్యులకు బాబు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Update: 2023-10-19 03:00 GMT

చంద్రబాబు జైలులో ఉన్నా కూడా తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నారు. ములాఖత్ అవుతున్న కుటుంబ సభ్యులకు బాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. నారా భువనేశ్వరిని ఇక మీదట ప్రజా క్షేత్రంలో ఉండేలా బాబు కొత్త డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ టూ రాజమండ్రి వయా విజయవాడ అన్నట్లుగా గత నెల రోజులకు పైగా ఉంటూ వస్తున్న నారా లోకేష్ ని సైతం జనంలోకి పంపిస్తున్నారు.

చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం చూస్తే భువనేశ్వరి జనంలోకి రావాలనుకుంటున్నారు. ఆమె ప్రోగ్రాం ని పార్టీ డిసైడ్ చేస్తోంది. ఆమె వారంలో మూడు రోజుల పాటు ఉంటారు. తన భర్త టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ జైలు సందర్భంగా ఆ వార్తను విని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలని ఓదార్చడం ద్వారా ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్రను భువనేశ్వరి పోషించనున్నారు అని అంటున్నారు.

ఇక వారంలో రెండు మూడు జిల్లాలు తిరగడం మూడు నాలుగు చోట్ల సభలు నిర్వహించడం వంటివి భువనేశ్వరి చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి నిజం గెలవాలి అన్న పేరుని కూడా పెట్టారు. ఈ విధంగా భువనేశ్వరి జనంలో నిరంతరం ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసారు అని అంటున్నారు.

అదే విధంగా కుమారుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర గత నలభై రోజులుగా ఎక్కడిది అక్కడ ఆగిపోయింది. దాంతో లోకేష్ ని కూడా ప్రజలలోకి పంపించాలని బాబు డిసైడ్ అయ్యారు. చంద్రబాబు మధ్యలో వదిలేసిన మీ భవిష్యత్తుకు టీడీపీ గ్యారంటీ అన్న కార్యక్రమాన్ని లోకేష్ చేపట్టనున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేంతవరకూ ఈ కార్యక్రమాలు చేపడతారు అని అంటున్నారు. విజయదశమి మధ్యలో ఉంది. తెలుగు వారికి అది ఇష్టమైన పండుగ. ఆ సందడి హడావుడి ఉంటుంది. దాంతో పండుగ వెళ్లిన తరువాత అన్నీ చూసుకుని మరీ తల్లీ కొడుకులు ఇద్దరూ జనంలోకి రానున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితం మీద జనంలోనే ఉంటూ వారికి అన్ని విషయాలు చెబుతూ చైతన్యం చేయడానికి పూనుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు జైలులో ఉన్న నలభై రోజుల తరువాత టీడీపీలో యాక్టివిటీ పెంచడానికి బాబు మార్క్ స్ట్రాటజీతో భువనేశ్వరి, లోకేష్ ప్రజల మధ్యకు వెళ్తున్నారు అని అంటున్నారు.

దీనికి వచ్చే స్పందనను బట్టి రానున్న రోజుల్లో మరింతగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని పోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు తన భార్య, కుమారుడి మీదనే మొత్తం పార్టీ బాధ్యతలను పెట్టారని అంటున్నారు. తన ఆబ్సెన్స్ లో పార్టీని మోయాల్సింది ఆ ఇద్దరే అని బాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి భూవనేశ్వరి సభలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

Tags:    

Similar News