ఇంకా అవుట్ డేటెడ్ పాలిటిక్సేనా బాబూ...!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితం అర్ధ శతాబ్దానికి చేరువ అవుతోంది. ఆయన ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నే ఇప్పటికీ చేస్తున్నారు. బాబు రాజకీయం కాలానికి తగినట్లుగా అప్టూ డేట్ కావాల్సి ఉంది.

Update: 2023-12-16 02:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితం అర్ధ శతాబ్దానికి చేరువ అవుతోంది. ఆయన ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నే ఇప్పటికీ చేస్తున్నారు. బాబు రాజకీయం కాలానికి తగినట్లుగా అప్టూ డేట్ కావాల్సి ఉంది. కానీ కాకపోవడానికి ఆ పార్టీలో ఓల్డ్ జనరేషన్ లీడర్స్ ఇంకా కొనసాగుతూ ఉండడమే. ఏడు పదులకు చేరువ అవుతున్న నాయకులే ఇంకా ఎన్నికలలో పోటీకి రెడీ అవుతున్నారు. వారు తప్పితే వారి వారసులు ఇలా టీడీపీ ఒక విధంగా ఇరుకున పడి ఉండిపోయింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీలో ఎమ్మెల్యేల సగటు వయసు యాభై లోపు ఉంటే టీడీపీలో అది అరవైలు దాటి ఉంది. ఇక 2024లో కొత్త రాజకీయం చూపిస్తాను అని పదే పదే చెబుతూ వస్తున్న చంద్రబాబు ఎన్నికలు ముంగిటలో ఉన్న వేళ రొడ్డ కొట్టుడు పాలిటిక్స్ నే చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పడం ఇంకా వచ్చే వారికి కన్ను గీటడమే కొత్త రాజకీయమా అని అంటున్న వారూ ఉన్నారు.

వైసీపీ మాకు వద్దు అని వదిలించుకున్న వారే టీడీపీకి మహా ప్రసాదమా అని అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. నిన్నటి దాకా వైసీపీ ఎమ్మెల్యేలను నానా మాటలు అన్న చంద్రబాబు ఈ రోజు జగన్ వద్దు అని పక్కన పెట్టిన వారికి కండువాలు వేస్తున్నారని నిందించారు.

జగన్ రాజకీయం ఏంటో కూడా చంద్రబాబుకు ఇపుడు అర్ధం కాదని అది అర్ధం అయ్యేనాటికి ఆయన రాజకీయంగా మరోసారి ఓటమిని స్వీకరించి ఒడ్డున కూర్చుంటారు అని పేర్ని నాని జోస్యం చెప్పారు. ఆయన అన్నారు అని కాదు కానీ వైసీపీ కొత్త ముఖాలు కొత్త తరం తో రాజకీయాలకు రెడీ అవుతూంటే టీడీపీ మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంటోంది అని అంటున్నారు.

ఈ చేరికలు అంతా 2014 నుంచి బాబు ఈ రోజుకీ అలాగే చేస్తూ వస్తునారు అని అంటున్నారు. దాని వల్ల ఫలితం లేదని 2019 ఎన్నికలు చెప్పినా బాబు ఎందుకో కండువాలు కప్పే కార్యక్రమం మాత్రం మానడం లేదు అంటున్నారు. పటిష్టమైన పార్టీ మాది అని చెప్పుకునే టీడీపీలో అభ్యర్ధులు లేరా అని అంటున్నారు.

దీని మీద వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున అయితే చంద్రబాబుకు అభ్యర్ధులు లేకనే వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతున్నారు అని అంటున్నారు. ఒక వైపు పాలిటిక్స్ లో ఎప్పటికపుడు న్యూ ట్రెండ్స్ ని జగన్ ఫాలో అవడమే కాదు ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే ఇంకా ఒకటి ఒకటి రెండు అన్న పాత చింతకాయ రాజకీయం చేయడమేంటి బాబూ అని అంటున్న వారూ ఉన్నారు.

పొత్తులు ఎత్తులు అన్నవి ఒక్కపుడు హిట్ ఫార్ములా. ఇపుడు సోషల్ మీడియా యుగం జనాలు కూడికలు సమీకరణల కంటే కూడా న్యూ జనరేషన్ పాలిటిక్స్ కే మొగ్గు చూపిస్తున్నారు. చేస్తామని చెప్పిన వారి వైపు ఉంటారు. కొత్తగా ఆలోచించే వారి పక్షం ఉంటారు. అంతే కానీ ఒకరు చేసింది అనుసరించే వారి వైపు ఉండరని అంటున్నారు. జగన్ విజన్ ఏంటో గ్రామ సచివాలయాలు, నాడు నేడు పేరుతో విద్య వైద్యాలయాల అభివృద్ధి వంటివి ఉన్నాయని అంటున్నారు.

అలాగే సంక్షేమ పధకాలు కూడా వైసీపీ బ్రాండ్ గా మారాయి. మేము అధికారంలోకి వస్తే వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పడం వల్ల టీడీపీకి కొత్త ఓటు ఎలా పుడుతుంది అని ప్రశించే వారూ ఉన్నారు. ఇక రాజధాని ఇష్యూ సెంటిమెంట్ గా ఎలా మారుతుందని ప్రశ్నించే వారూ ఉన్నారు. ముందు తాను తన కుటుంబం, తన వూరు ఆ మీదట మిగిలినవి అని జనాలు ఆలోచిస్తున్న రోజులలో ఏళ్ల తరబడి బాహు బలి నిర్మాణాలు లక్షల కోట్లతో ప్రాజెక్టులు, వాటి కోసం భారీ కాన్వాస్ తో స్కెచ్ లు ఇవన్నీ అవసరమా వర్కౌట్ అవుతాయా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇంక మరో వైపు చూస్తే జగన్ 2019 నుంచి 2024 తన పాలన చూపించి జనాలను ఓట్లు అడుగుతారు అని 2014 నుంచి 2019 దాకా తన పాలన మీద ఓటు అడిగే సత్తా బాబుకు ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే చంద్రబాబు పొలిటికల్ విజనరీ తడబడుతోంది అంటున్నారు. అది అవుట్ డేటెడ్ గా మారిందని అంటున్నారు. మరి బాబు అతి తక్కువ సమయంలో తన రూట్ మార్చుకుని విన్నింగ్ చాన్సెస్ ని అందుకుంటారా ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారా అన్నది చూడాలని అంటున్నరు.

Tags:    

Similar News