బుర్కినా ఫాసోలో మారణ హోమం.. బైకుల మీద వెంటాడి పైశాచికంగా దాడి..

అయితే తాజాగా బుర్కినా ఫాసో ప్రాంతంలో సంభవించిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

Update: 2024-10-05 07:54 GMT

ఆఫ్రికా దేశాలలో అప్పుడప్పుడు కొన్ని భయానక ఘటనలు సంభవిస్తూ ఉంటాయి. అయితే తాజాగా బుర్కినా ఫాసో ప్రాంతంలో సంభవించిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సాంకేతికంగా ఎంతో ప్రగతి పథంలో నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంత అనాగరికమైన ప్రవర్తన ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. బర్సాలోగో పట్టణంలో జరిగిన మారణ హోమం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అల్‌ఖైదా,ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్రసంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమిన్‌ కు సంబంధించిన మిలిటెంట్లు కిరాతకంగా ప్రవర్తించారు. అన్యం పుణ్యం ఎరుగని 600 మంది ప్రాణాలను గంటల వ్యవధిలో గాలిలో కలిపేశారు. అత్యంత అమానుషమైన ఈ ఘటన ఆగస్టు 24న చోటు చేసుకుంది. అయితే ఈ మారణ హోమం నెలలు గడిచిన తరువాత ఇప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జననివాసాలపై బైకులలో వచ్చి దాడి చేసిన ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారు. చనిపోయిన వారిలో అత్యధికంగా మహిళలు.. ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా నివేదికలో పేర్కొంది. ప్రాణభయంతో పరుగులు పెట్టుతున్న వదలకుండా పైశాచికంగా వారి వెనకబడి కాల్చిపులు జరిపారు. సంఘటన జరిగిన తరువాత మృతదేహాలను సేకరించడానికి అధికారులకు మూడు రోజుల సమయం పట్టిందట.

బుర్కినా ఫాసోలో తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల చుట్టూ లోతైన ఖండ కాలు తవ్వమని సైన్యం ప్రజలకు సూచించింది. ఆర్మీ ఆదేశాల ప్రకారం గ్రామం చుట్టూ కందకాలు తగ్గుతున్న ప్రజలను సైనికులుగా భావించి ఆగస్టు 24న ఉగ్రవాదులు దాడులు జరిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్న వారి వెనక బైకులలో వెంటాడి బతకంగా చంపారు.

అత్యంత భయంకరమైన ఈ ఘటనలో మొదట మరణించిన వారు 20 మంది ఉంటారు అని ఐరాస అంచనా వేసింది. అయితే సుమారు 600 మందికి పైగా చనిపోయారని తెలుస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఘర్షణ కారణంగా 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు అని అంచనా. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అమాయకపు ప్రాణాలు బలి కాబోతున్నాయో అర్థం కావడం లేదు

Tags:    

Similar News