ర్యాంకులు.. మంత్రులు.. చంద్ర‌బాబు చెప్పాక ఏమైందంటే..!

ఇదిలావుంటే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న ఫ‌రూక్ కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యారు. రెండో ప్లేస్‌లో ఉన్న దుర్గేష్‌.. పెట్టుబ‌డుల సాధ‌న‌కు కృషి చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.

Update: 2025-02-23 09:30 GMT

కొన్ని రోజుల కింద‌ట సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గానికి ర్యాంకులు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ ర్యాంకు మైనారిటీ మంత్రి ఫ‌రూక్‌కు ఇచ్చారు. రెండో ర్యాంకుజ‌న‌సేన మంత్రి.. దుర్గేష్‌కు ఇచ్చా రు. త‌న‌కు నాలుగో ర్యాంకు ఇచ్చుకున్న చంద్ర‌బాబు.. ఇత‌ర మంత్రుల ప‌నితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. అదేస‌మ‌యంలో ఫైళ్లు క్లియ‌రెన్స్‌ను బ‌ట్టే ఈ ర్యాంకులు ఇచ్చిన‌ట్టు చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఇక నుంచైనా మంత్రులు యాక్టివ్ కావాల‌ని కూడా చెప్పుకొచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. మంత్రులు ఏం చేస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌. చంద్ర‌బాబు హెచ్చ‌రించిన త‌ర్వాత‌.. మంత్ర‌వ‌ర్గంలోనూ ఒక‌రిద్ద‌రికి క్లాస్ తీసుకున్న‌త‌ర్వాత‌.. ప్ర‌క‌టించిన ర్యాంకుల్లో చివ‌రి నుంచి నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న మంత్రులు.. మ‌రింత పుంజుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. ఈ ర్యాంకులు ప్ర‌క‌టించి 15 రోజుల‌కు పైగానే అయినా.. మంత్రులు అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే త‌మ త‌మ పేషీల‌కు వ‌స్తున్నారు.

ఎక్కువ‌గా జిల్లాల్లోనే త‌మ స‌మ‌యాన్నికేటాయిస్తున్నారు. పోనీ.. ఇక్క‌డైనా.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న మంచిని ప్ర‌చారం చేస్తున్నారా? అంటే.. అది లేద‌ని అంటున్నారు. సొంత వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు.. టూర్లు పెట్టుకుని.. కాల‌హ‌ర‌ణం చేస్తున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తున్న మాట‌. దీంతో ర్యాంకులపై మంత్రులు లైట్ తీసుకున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు ఇచ్చిన ర్యాంకుల‌ను చాలా మంది మంత్రులు ప‌క్క‌న పెట్టార‌ని.. ఇలా అయితే.. క‌ష్ట‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న ఫ‌రూక్ కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యారు. రెండో ప్లేస్‌లో ఉన్న దుర్గేష్‌.. పెట్టుబ‌డుల సాధ‌న‌కు కృషి చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, 8 వ‌స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ ర్యాంకుల గురించి ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. అంతేకాదు.. మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసుకున్న డిప్యూటీ సీఎం కార్యాల‌యానికి కూడా ఆయ‌న రాలేదు. మ‌హిళా మంత్రులు కూడా ఇలానే ఉన్నారు. సో.. మొత్తానికి చంద్ర‌బాబు ఇచ్చిన ర్యాంకుల ప్ర‌భావం పెద్ద‌గా ఫ‌లించ‌డంలేద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు.

Tags:    

Similar News