జగన్ మీద బాలినేనికి ఎందుకు అంత కోపం ?

ఈ సంగతి జిల్లాలో ఉన్న పార్టీలో అందరికీ తెలుసు. జిల్లావ్యాప్తంగా వాసు అన్నా అని అందరూ పిలుస్తారు. వాసు బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు

Update: 2024-11-28 06:39 GMT

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వాసు అని పేరు. ఈ సంగతి జిల్లాలో ఉన్న పార్టీలో అందరికీ తెలుసు. జిల్లావ్యాప్తంగా వాసు అన్నా అని అందరూ పిలుస్తారు. వాసు బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి బాలినేని వెంకటేశ్వరర రెడ్డి సొసైటీ బ్యాంక్ లో జాబ్ చేసేవారు. ఆయన ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో పనిచేసేవారు. ఇక బాలినేనిది సొంత నియోజకవర్గం కొండెపి అని అనుకున్నా వారి కుటుంబం మొత్తం చిన్నప్పటి నుంచి ఒంగోలులోనే ఉంటూ వచ్చింది.

అలా సొంత ఊరు కొండెపితో పెద్దగా బాలినేని ఫ్యామిలీకి టచ్ లేదు అనే అంటున్నారు. ఇక బాలినేని ఒంగోలులో యూత్ లీడర్ గా కెరీర్ ప్రారంభించి అలా ఎదుగుతూ వచ్చారు. ఒంగోలులో రెడ్డి సామాజికవర్గం పెద్దగా లేకున్నా ఆయన తన మంచితనంతో ఎదిగారు. ఆయనకు ఎమ్మెల్యే కావాలని బలంగా మనసులో మొదటి నుంచి ఉండేది.

జగన్ కి బాబాయ్ వైఎస్సార్ కి తోడల్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డిది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లావే కావడం విశేషం. వైవీ సుబ్బారెడ్డికి ఒక్కరే చెల్లెలు. అలా తన చెల్లెలుని బాలినేనికి ఇచ్చి పెళ్ళి చేశారు. అలా చూస్తే కనుక ఇండైరెక్ట్ గా వైఎస్సార్ కి బాలినేని బంధువు అయ్యారు.

ఇక 1999లో ఒంగోలు అసెంబ్లీకి పగడాల రామయ్యకు సీటు ఖరారు అయితే అపుడు ఫ్యామిలీ ప్రెషర్ తో  వైఎస్సార్ దగ్గర నుంచి బాలినేని అలా సీటు తెచ్చుకున్నారు అని చెప్పుకుంటారు. ఇక ఎలాగూ రెడ్డి సామాజిక వర్గం లేదు కాబట్టి బాలినేనికి సీటు ఇచ్చినా గెలవరు అని అనుకున్నారు.

అయితే అపుడు ఒంగోలులో కమ్మ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వకుండా అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈదర హరిబాబుకు టికెట్ కి నో చెప్పి వారికి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎందుకంటే కరణం బలరాం కి ఈదర హరిబాబుకు రాజకీయంగా పడదు. దాంతో ఈ విధంగా అక్కడ టీడీపీ టికెట్ వేరే వారికి ఇచ్చేశారు.

ఇక చంద్రబాబు కరణం బలరాం మాటకు విలువ ఇచ్చారు. అలా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడంతో ఈదర హరిబాబు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు

దాంతో ఒంగోలులో త్రుముఖ పోటీ ఏర్పడింది. అలా బాలినేని మొదటిసారి ఈ ట్రయాంగిల్ పోరులో కేవలం 6,222 ఓట్ల తేడాతో గెలిచారు.

అలా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని వైఎస్సార్ కి బాగా దగ్గర అయ్యారు. ఆ సమయంలో వైవీ సుబ్బారెడ్డి రాజకీయాలలో డైరెక్ట్ గా ఏమీ లేరు. దాంతో ఆ విధంగా బాలినేని ఎదుగుదల వల్ల ఆయనకు ఇబ్బంది లేకుండా పోయింది.

ఇక 2004లో వైఎస్సార్ ప్రభంజమతో మరోసారి బాలినేని ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒంగోలులో టీడీపీ బలంగా ఉంది, పైగా సామాజికవర్గం పరంగా బలంగా ఉంది. అయినా కూడా బాలినేని తన రాజకీయ వ్యూహంతో కమ్మ కాపు వర్గాలను మంచి చేసుకుని గెలుస్తూ వచ్చారు.

సహజంగానే జిల్లాలో అంతా బాలినేని పెత్తనమే సాగేది. వైఎస్సార్ కూడా వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాలినేనికే ఎక్కువ విలువ ఇచ్చారు. ఎందుకంటే కమ్మ సీట్లో వరసగా బాలినేని విజయం సాధిస్తూ వస్తున్నారు అన్న కారణంతో అంటారు. ఇక కాంగ్రెస్ ఏలుబడిలో జిల్లాలో ఉన్న వారు అంతా బాలినేని దగ్గరకే వెళ్లేవారు.

ఇక బాలినేని 2009లో మరోసారి గెలిచారు. దాంతో వైఎస్సార్ తన మంత్రివర్గంలో బాలినేనికి స్థానం ఇచ్చారు. అయితే వైఎస్సార్ మరణానంతరం వైఎస్సార్ ఫ్యామిలీకి విధేయత చూపించాలని తనకు దక్కిన మంత్రి పదవిని సైతం బాలినేని వదులుకుని జగన్ వైపు వచ్చారు.

అప్పట్లో ముఖ్యమంత్రి రోశయ్య కూడా వ్యక్తిగతంగా పిలిచి మరీ బాలినేనికి నచ్చచెప్పారు. మంత్రి పదవి వదులుకోవద్దు మంచి భవిష్యత్తు ఉందని కూడా పెద్దాయన చెప్పినా జగన్ కోసం బాలినేని తన మంత్రి పదవిని త్యాగం చేశారు.

అలా మొదట కాంగ్రెస్ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన బాలినేని జగన్ జైలుకు వెళ్ళాక ఆయన ఆదేశాలతో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో నాలుగో సారి గెలిచారు

ఇక పులివెందుల కడప ఉప ఎన్నికలలో జగన్ కోసం కొంత డబ్బులు బాలినేని ఖర్చు పెట్టారు. ఎందుకంటే జగన్ భారీ మెజారిటీతో గెలవాలనే అని అంటారు. ఇక బాలినేని జగన్ కి మామ వరస అవుతారు. కానీ జగన్ అయన్ని అన్నా అనే పిలుస్తారు.

అయితే అసలు విషయం ఏంటి అంటే 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీకి దిగడం. అపుడు బాలినేని మొదటిసారి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అలా నాటి నుంచి ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అంటారు.

బాలినేని మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నారు. కానీ జగన్ వైవీని తెచ్చి పెట్టారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా వైవీ గెలిచారు. కానీ ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని ఓటమి పాలు అయ్యారు. తన ఓటమికి వైవీనే కారణం అని బాలినేని భావించి అప్పటి నుంచి దూరం పాటిస్తున్నారు. అలా బాలినేని వైవీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది అని అంటారు.

ఇక ఎంపీగా గెలిచాక వైవీకి జిల్లాలో కొంత క్యాడర్ ఏర్పడింది. ఒంగోలులో వైవీ పెత్తనం స్టార్ట్ కావడంతో బాలినేని తన ప్రాభవం తగ్గింది అని భావిస్తూ ఉండేవారు. తన ఆవేదనను జగన్ దగ్గర ఎన్నో సార్లు బాలినేని వ్యక్తం చేసిన జగన్ అయితే ఈ ఇదరి మధ్య సర్దుబాటు చేయలేదు.

అయితే 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ వైవీని కాదని టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెచ్చి పోటీ చేయించారు బాలినేని. దీంతో బాలినేని వైవీల మధ్య రాజకీయంగా మరింత దూరం పెరిగి జగడం తీవ్రం అయింది. ఇక 2019 ఎన్నికల తరువాత బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకుండా వైవీ అడ్డుకున్నారు అని బాలినేని వాదన. అయితే జగన్ మాత్రం బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు.

ఇక మంత్రిగా బాలినేని ఉండగా తన కొడుకుకు ఒంగోలులో రాజకీయ పెత్తనం పూర్తిగా అప్పగించారు. అలా పార్టీ వ్యవహారాలు అన్నీ ఇబ్బందులో పడ్డాయని అంటారు. ఒంగోలులో బాలినేని వాసు, బాలినేని ప్రణీత్, బాలినేని వియ్యంకుడు ఇలా ఈ ముగ్గురి పెత్తనం ఎక్కువ అయింది అని ఒంగోలులో ప్రచారం తీవ్రంగా సాగింది.

దానికి తోడు బాలినేని ప్రణీత్, ఆయన మామ కలసి ఒంగోలులో విల్లాస్ కట్టారు. అక్కడ మట్టిని విపరీతంగా తోలారు అనుమతి లేకుండా అని జగన్ కి పెద్ద ఎత్తున బాలినేని కొడుకు మీద వియ్యంకుడు మీద ఫిర్యాదులు వెళ్ళాయి. అవన్నీ కూడా వైవీ సుబ్బారెడ్డి కొడుకు సీఎం ఆఫీసులో ఉండి తమ మీద ఫిర్యాదులు చేయించేవారు అని బాలినేని వాదనగా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే జిల్లాలో జగన్ మనిషి అయిన సురేష్ మంత్రి పదవిని కంటిన్యూ చేస్తూ బాలినేని పదవిని తీసేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కోపం తో పాటు చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని కాదని టీడీపీ జనసేన కూటమిలో ఎన్నికలకు ముందే చేరాలని బాలినేని మాట్లాడుకున్నారు అని ప్రచారంలో ఉంది. అయితే తిరిగి ఆయన వైసీపీ నుంచే పోటీ చేసి దారుణంగా ఓటమి పాలు అయ్యారు.

ఇక బాలినేని గెలవాలి అన్న పట్టుదలతో జిలాలోనే అత్యధికంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని అంటారు. ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థికంగా బలహీనం అయ్యారని కూడా అంటారు. ఇక ఎన్నికల ఖర్చు విషయంలో జగన్ ని అడిగితే మీరే చూసుకోవాలి అని అనడంతో బాలినేని నే అవమానంగా ఫీల్ అయ్యారని చెబుతారు. ఇలా చాలా విషయాల్లో బాలినేని జగన్ దగ్గర ఇన్సల్ట్ అయ్యారని అంటారు.

వైసీపీ ఏర్పాటులో తాను కీలకం అని భావించే బాలినేనికి అక్కడ వైవీ సజ్జలల పెత్తనం నచ్చలేదు అంటారు. ఆ పార్టీలో ఉంటే తనకు మరింత ఇబ్బందులే అని భావించే ఆయన జనసేనలోకి జంప్ చేశారు అని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోసం ఆయన ట్రై చేస్తున్నారని టాక్. అలా గెలిచి మంత్రి కావాలని కూడా ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News