మంటల్లో పెట్రోల్ పోస్తున్న బంగ్లా..ఇస్కాన్ సభ్యులపై మరో చర్య

భారత్ పక్క నుంచే బుల్లి దేశం బంగ్లాదేశ్ తన తోక జాడిస్తోంది. భారత దేశంపై అకారణంగా విద్వేషం పెంచుకున్న అక్కడి ప్రభుత్వ పాలకుల అండ చూసుకుని చెలరేగుతోంది

Update: 2024-12-02 09:22 GMT

భారత్ పక్క నుంచే బుల్లి దేశం బంగ్లాదేశ్ తన తోక జాడిస్తోంది. భారత దేశంపై అకారణంగా విద్వేషం పెంచుకున్న అక్కడి ప్రభుత్వ పాలకుల అండ చూసుకుని చెలరేగుతోంది. మత సామరస్యం పాటిస్తామని.. హిందువులపై దాడులు కేవలం రాజకీయ కారణాలతో జరిగినవేనని బుకాయిస్తోంది. కానీ, పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.

ఇంతకూ ఏం జరిగింది?

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఇటీవల ఓ ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్‌) ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ మీద.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్నఆరోపణలున్నాయి. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 18 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో హిందువులు, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.

హసీనా సర్కారు మారడంతో..

కొన్ని నెలల కిందట బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కారు పతనంతో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చింది. ఇది తాత్కాలిక సర్కారే. కానీ, యూనస్ కు భారత్ అంటే ద్వేషం. ఇక బంగ్లాలోని కొందరు అతివాదులకు భారత్ పై పీకల దాకా కోపం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత జాతీయ జెండాను అవమానించే చర్యలకు పాల్పడ్డారన్న కథనాలు వచ్చాయి. ఇలా వరుసగా హిందువులపై దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లతో బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

ఇస్కాన్ పైనే గురి?

బంగ్లా తాత్కాలిక సర్కారు. ఇస్కాన్‌ పూజారులు, సభ్యులను అరెస్టు చేస్తూ టార్గెట్ చేస్తోంది. దీంతో క్షణక్షణం భయంగా గడపాల్సి వస్తోంది. హిందువులతో పాటు ఇతర మైనార్టీ వర్గాలు భయాందోళనలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ కు వచ్చేందుకు సిద్ధమైన 63 మంది ఇస్కాన్ సభ్యులను బంగ్లా ఇమిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ బెనాపోల్‌ సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద నిలిపివేశారు. అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నారే కారణంతో దేశం వీడి వెళ్లేందుకు అనుమతించలేదట. ఉన్నతాధికారుల చెప్పడంతోనే ఇలా చేసినట్లు సమాచారం.

మతపరమైన కార్యక్రమం కోసమే భారత్ కు వెళ్తున్నట్లు చెప్పినా తమను అడ్డుకున్నారని ఇస్కాన్ సభ్యుడు సౌరభ్‌ తపందర్‌ ఛేలి తెలిపారు. కొన్ని గంటల పాటు వేచి చూశామని.. అయినా సరైన సమాధానం రాలేదని, వెనక్కు వెళ్లిపోయామని వాపోయారు.

Tags:    

Similar News