లిప్ రీడర్స్ రిలాక్స్... ఒబామాతో ట్రంప్ సీక్రెట్ సంభాషణ ఇదే!

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-11 05:21 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా లు రహస్యంగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సమయంలో.. వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకున్నారాబ్బా? అంటూ నెట్టింట ప్రశ్నలు హల్ చల్ చేశాయి. ఈ సమయంలో లిప్ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా... తాను ఓ విషయం గురించి మాట్లాడాలని, అయితే ఇక్కడ కాకుండా ఓ ప్రశాంతమైన ప్లేస్ కావాలని ఒబామాతో డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు లిప్ లీడర్లు అంచనా వేశారు.

ఇదే సమయంలో.. తాను ఒకదాని నుంచి బయటపడ్డాననీ.. ఆ పరిస్థితి మీరు ఊహించగలారా అని ట్రంప్ పేర్కొన్నారని.. దానికి బరక్ ఒబామా నవ్వి ఊరుకున్నారని.. అదే సమాధానంగా ఇచ్చారని మరో లిప్ లీడర్ అంచనా వేసినట్లు చెబుతున్నారు. అయితే... ఈ అంచనాలను అంతర్జాతీయ మీడియా అధికారికంగా ధృవీకరించలేదు.

ఇలా.. కాబోయే ప్రెసిడెంట్ - మాజీ ప్రెసిడెంట్ మధ్య జరిగిన రహస్య సంభాషణకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో.. లిప్ లీడర్లు రకరకాల అంచనాలు వేస్తున్నారని కథనాలొస్తున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో బరక్ ఒబామాకు, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు.

అవును... జిమ్మీ కార్టర్ అంత్యక్రియల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ - బరక్ ఒబామా లు రహస్యంగా మాట్లాడుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్... "ఒకరినొకరు ఇష్టపడే ఓ ఇద్దరు వ్యక్తుల్లా మనం ఇప్పుడు కనిపిస్తున్నాం" అని ఒబామాతో చెప్పినట్లు తెలిపారు.

కాగా... అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి.. జో బైడెన్, కమలా హారిస్ దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ క్రమంలో ట్రంప్ పక్కనే ఒబామా కూర్చున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య సంభాషణ మొదలైంది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ సమయంలో లిప్ లీడర్ల రకరకాల అంచనాలు హల్ చల్ చేసిన వేళ.. అసలు విషయాన్ని ట్రంప్ వెల్లడించారు.

Tags:    

Similar News