వరల్డ్ బెస్ట్ షార్ప్‌ షూటర్‌... రికార్డ్ డిస్టెన్స్ లో పెర్ఫెక్ట్ షాట్!

తాజాగా ఓ ఉక్రెయిన్‌ షార్ప్‌ షూటర్‌.. చాలా దూరం నుంచే రష్యా సైనికుడిని కాల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది.

Update: 2023-11-21 01:30 GMT

2022 ఫిబ్రవరిలో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ఇలా దాదాపు ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్‌ సైన్యం తమ భూభాగంలోకి అడుగుపెట్టిన రష్యా దళాలతో పోరు సాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఉక్రెయిన్‌ షార్ప్‌ షూటర్‌.. చాలా దూరం నుంచే రష్యా సైనికుడిని కాల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది.

అవును... ఒక ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా రెండున్నర మైళ్ల (3.8 కిలోమీటర్లు) దూరం నుంచి షూట్ జరిపినట్లు ఉక్రెయిన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పుడు ఇది తాజా రికార్డ్ అని, గతంలో ఉన్న రికార్డులను ఈ స్నైపర్ చెరిపివేసిందని ఉక్రెయిన్ మీడియా రాసుకొస్తుంది. గతంలో ఉన్న 3.54కి.మీ. స్నైపర్ రికార్డ్ ఇక్కడితో చెరిగిపోయిందని అంటుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ విభాగానికి చెందిన ఓ స్నైపర్‌ ఏకంగా 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సైనికుడిని కాల్చి చంపినట్లు ఆ విభాగం ధ్రువీకరించింది. దీంతో షార్ప్‌ షూటింగ్‌ లో ఈ ఉక్రెయిన్ సైనికుడు ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు స్థానిక మీడియాకు తెలిపింది.

ఈ సందర్భంగా గత రికార్డులను గుర్తుచేసిన ఉక్రెయిన్ మీడియా... 2009లో ఓ బ్రిటిష్‌ స్నైపర్‌.. అఫ్గానిస్థాన్‌ లోని తాలిబన్‌ ఫైటర్‌ ను 2.5 కిలో మీటర్ల దూరం నుంచి చంపేశాడు. ఆ తర్వాత 2017లో కెనడియన్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌ కు చెందిన ఓ స్నైపర్‌.. ఇరాక్‌ లో సుమారు 3.54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును షూట్ చేసి చంపాడు. ఈ క్రమంలో ఆ రికార్డులను ఉక్రెయిన్‌ స్నైపర్‌ అధిగమించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా గతేడాది ఫిబ్రవరిలో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రెండు దేశాల మధ్య పోరు అవిరాంఅంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇంకా ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందనేది ప్రపంచ పటంపై అతిపెద్ద ప్రశ్నగా ఉంది!

Tags:    

Similar News