ఆళ్లగ‌డ్డ టీడీపీ టిక్కెట్... "భూమా"కేకానీ అఖిల ప్రియకు కాదు!?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు

Update: 2023-10-15 13:54 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు ఎప్పుడొస్తారు అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో స్కిల్ స్కాం కేసులో బెయిల్ పై బయటకు వచ్చినా.. తదుపరి మరికొన్ని కేసులు వరుసగా ఉన్నాయని అంటున్నారు. ఈలోపు అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేలు, అనలిస్ట్ లు, చినబాబు ఎవరిపని వారు చేస్తున్నారని అంటున్నారు.

అవును... చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికలకు సంబంధించిన సర్వేలు అవిరామంగా సాగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సర్వే ఫలితాలు నంద్యాల జిల్లాలోని ఆల్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే ఫలితాలు వచ్చాయని.. దీంతో ఆ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టాణం ఒక నిర్ణయానికి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది.

వివిధ సంస్థల స‌ర్వేల్లో అఖిల‌ప్రియ‌కు తీవ్రమైన ప్రజావ్యతిరేక‌త ఉన్నట్టు నివేదిక‌లు టీడీపీ అధిష్టానానికి అందాయనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో భూమా అభిమానులంతా అఖిల‌ ప్రియ‌తో కాకుండా, భూమా కిశోర్‌ రెడ్డి వెంట న‌డుస్తున్నట్టు స‌ర్వేల ద్వారా తేలిందంట. అయినప్పటికీ అఖిల ప్రియకు టిక్కెట్ ఇస్తే ఆ సీటును చేజేతులా వదులుకున్నట్లే అనే కామెంట్లు చేస్తున్నారంట.

ఈ నేపథ్యంలో రాయ‌ల‌సీమ జిల్లాల టీడీపీ ఇన్‌ చార్జ్‌ బీద ర‌విచంద్రతో భుమా కిశోర్‌ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానం పెద్దల‌తో ఆయన మాట్లాడించారని అంటున్నారు. రాబోయే ఎన్నీకల్లో ఆళ్లగడ్డ టిక్కెట్ అఖిల ప్రియకు కాకుండా... కిశోర్ కు ఇవ్వాలని సర్వే ఫలితాలతో టీడీపీ పెద్దలు నిర్ణయించారని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ విషయంలో అఖిల‌కు తెలియ‌కుండానే ఇదంతా జ‌రుగుతోందని అంటున్నారు. అంటే... అస‌లు అఖిల‌ప్రియ‌ను టీడీపీ అధిష్టానం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకుందా.. లేక, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న అఖిల ప్రియ అందుకు కట్టుబడి ఉంటారనే నమ్మకంతో తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది!

మరోపక్క లోకేష్ సమక్షంలో త్వరలో కిశోర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు, నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆ క్షణమే అందించే దిశగా అడుగులు వేస్తున్నారని, ముహూర్తం కోసం చూస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు బయటకు వచ్చే వరకూ చూసి ఉన్న పుణ్యకాలాన్ని ఖర్చు పెట్టడం కంటే... చినబాబు ఆధ్వర్యంలో ఈ పని పూర్తిచేసేలా ఉన్నారని తెలుస్తుంది.

కాగా... చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఇటీవల అఖిల ప్రియ నిరాహర దీక్ష చేసిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో... చంద్రబాబు కోసం జైలు గోడ‌లు బ‌ద్దలు కొడ‌తాన‌ని కూడా ఆమె ఇటీవ‌ల సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు! దీంతో... టీడీపీ అధిష్టాణం తీసుకునే నిర్ణయానికి ఆమె కట్టుబడి ఉండటమే కాకుండా... అవసరమైతే, పార్టీ ఆదేశిస్తే కిశోర్ రెడ్డికి సహకరిస్తారు కూడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా... ఆళ్లగడ్డ టీడీపీ టిక్కెట్ ఈసారి కూడా కూడా "భూమా" ఫ్యామిలీకే దక్కుతుండటంతో వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News