తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

అయితే... తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారంటూ సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

Update: 2024-12-19 07:19 GMT

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ప్రాంతాలుగా విడిపోయాం కానీ.. మనుషులుగా కాదు అనే కామెంట్లూ వినిపిస్తుంటాయి. ఏపీలో తెలంగాణ వారికి, తెలంగాణలో ఏపీవారి పట్ల ఎలాంటి వివక్షపూరిత వాతావరణంలేదని అంటారు. అయితే... తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారంటూ సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

అవును... తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలూ చేశారు. మరోపక్క టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఇదే విషయంపై విజ్ఞప్తిని చేశారు.

గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్... తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతీబిడ్డ.. శ్రీవారిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించుకుంటారని తెలిపారు.

ఇదే సమయంలో... రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తిరుమల శ్రీవారు అందరివాడని గుర్తు చేశారు! ఈ సందర్భంగా... గతంలో ఏపీ తెలంగాణ విడిపోయిన సమయంలో తెలంగాణ భక్తులకు కొండపై అన్ని రకాల సౌకర్యాలు కల్పించేవారని.. అప్పట్లో ఎలాంటి వివక్షా చూపించలేదని.. వైసీపీ హయాంలో కూడా ఎటువంటి వివక్ష లేదని తెలిపారు.

అయితే.. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని.. ఈ విషయంలో సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వరకూ అందరిపైనా వివక్ష చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు!

ఇదే సమయంలో... తెలంగాణ ప్రజలపై వివక్ష చూపిస్తే, అన్యాయం చేస్తే... రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోపక్క... తిరుమలకు వచ్చే తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులకు.. ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడుని.. బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.


Full View


Tags:    

Similar News

ఇక ఈడీ వంతు