ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇదే సమయంలో "యాత్ర-2" కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరో కోటి మళ్లించారని ఇటీవల సంచలన కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై జీవీ రెడ్డి స్పందించారు.

Update: 2024-12-19 09:40 GMT

గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో.. "వ్యూహం" సినిమా కోసం సుమారూ రూ.1.10 కోట్లను ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఓ ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని.. ఇదే సమయంలో "యాత్ర-2" కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరో కోటి మళ్లించారని ఇటీవల సంచలన కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై జీవీ రెడ్డి స్పందించారు.

అవును... సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి ఏపీ ఫైబర్ నెట్ అధికారులు అక్రమంగా రూ.2.10 కోట్లు చెల్లించారని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కనెక్షన్ల సంఖ్య కూడా సగానికి పడిపోయిందని తెలిపారు.

ఇందులో భాగంగా... 2016లో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించగా.. 2019 నాటికి సుమారు 24 వేల కి.మీ. మేర కేబుల్స్ వేశారని.. 10 లక్షల వరకూ కనెక్షన్స్ ఇచ్చామని తెలిపారు. అయితే... ప్రస్తుతం ఆ సంఖ్య ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే "వ్యూహం" సినిమా ప్రస్థావన తెచ్చారు.

ఈ క్రమంలోనే... ఆ సినిమాను ఫైబర్ నెట్ లో టెలీకాస్ట్ చేసి ఆర్జీవీకి చెల్లింపులు చేశారని.. ఆ విషయంలో ఏక్కడా లేని విధంగా అధికారులు వ్యవహరించారని.. నాడు ఆ సినిమాకు 18 లక్షల వ్యూస్ వస్తే చెల్లించాల్సింది రూ.2 లక్షలు అయితే.. రూ.2.10 కోట్లు ఇచ్చారని తెలిపారు.

ఇక... ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురిచేసిందని.. అప్పటి నుంచి ఎండీ మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చరలు తీసుకుంటామని జీవీ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో.. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక డాక్యుమెంట్లు మార్చేశారని అన్నారు.

ఈ క్రమంలో ఈ కీలక డాక్యుమెంట్లను ఏపీ ఫైబర్ నెట్ లోని ఓ మహిళా ఉద్యోగి.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేరవేశారని.. ఈ విషయం తెలిసి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని జీవీ రెడ్డి వివరించారు.

కాగా... ఈ ఆరోపణలు ఓ న్యూస్ ఛానల్ లో ప్రసారమవ్వగా గతంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఆర్జీవీ... "వ్యూహం" సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత కాగా.. శ్రీకాంత్ ఫైనాన్స్ అందించారని.. ఆ ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ ప్రసారహక్కులను తన పార్టనర్ రవివర్మ సొంతంగా కొనుగోలు చేశారని తెలిపారు.

అనంతరం రవివర్మ నుంచి ఏపీ ఫైబర్ నెట్ ప్రసార హక్కులను రెండూ కోట్లకు కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే వాటిలో ఒక కోటి రూపాయలు మాత్రమే అకౌంట్ కు వచ్చిందని.. ఇది శ్రీకాంత్ - రవివర్మలకు సంబంధించిన ఒప్పందం అని తెలిపారు. వాస్తవానికి ఈ హక్కులు ఏపీ ఫైబర్ నెట్ కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయని అన్నారు.

ఈ సందర్భంగా ఫైబర్ నెట్ చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్ ను సొంతం చేసుకుందని వెల్లడించారు. ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేయడంతో ప్రసారాలను నిలిపివేశారని.. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ను ఏపీ ఫైబర్ నెట్ నిలిపివేసిందని వెల్లడించారు. దీనిపై రవివర్మ సివిల్ కోర్టును ఆశ్రయించారని అన్నారు.

Full View
Tags:    

Similar News