చెప్పి చూసిన చంద్రబాబు.. ఇకపై స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్!

అవును... కొంతమంది టీడీపీ ఎమ్మెలేల పనీతీరుపైనా, వ్యవహార శైలిపట్ల ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

Update: 2024-10-20 06:11 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా చంద్రబాబు తనదైన మాకు పాలనతో ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ 4వేలకు పెంచడంతోపాటు, 'ఉచిత' ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఇటీవల లిక్కర్ నూతన పాలసీలో భాగంగా.. ప్రైవేటు వ్యక్తులకు మద్యం వ్యాపార బాధ్యతలు అప్పగించారు.

ఈ క్రమంలో దీపావళి కానుకగా ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక తల్లికి వందన, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక సాయం మొదలైన అన్ని హామీలను వరుసగా అమలు చేయడానికి అవిరామంగా కృషి చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఇప్పటికే పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, టార్గెట్ నిర్ధేశించిన చంద్రబాబు.. అమరావతి 2.0ని ప్రారంభించారు. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ బాబు దూసుకుపోతున్న వేళ.. కొంతమంది ఎమెల్యేల పనితీరు, వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... కొంతమంది టీడీపీ ఎమ్మెలేల పనీతీరుపైనా, వ్యవహార శైలిపట్ల ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలోనూ, ప్రధానంగా లిక్కర్ షాపుల విషయంలోనూ కల్పించుకుంటున్నారని.. ఫలితంగా ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

దీంతో... ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి వెళ్లడం, ఆయన సీరియస్ గా హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే! ఎమ్మెల్యేలు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక, లిక్కర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన పదే పదే హెచ్చరించారు! అయినప్పటికీ... పలువురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రాలేదని.. మరికొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు అందుతున్నాయని అంటున్నారు.

దీంతో... చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఐ.వీ.ఆర్.ఎస్. మెకానిజంని ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా... ప్రతీ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేపైనా ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తిసుకుంటానని.. మీ మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు!

ఇదే సమయంలో ప్రతీ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే పనితీరును గుర్తించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు. ఏదైనా తప్పు చేసినట్లు తెలిస్తే.. వెంటనే సంబందిత కమిటీ సదరు ఎమ్మెల్యేని సంప్రదిస్తుందని.. తప్పు పునరావృతం అయితే చంద్రబాబు ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.

దీంతో... ఇది ఎమ్మెల్యేలకు బిగ్ అలర్ట్ అని.. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు పరిశీలకులు. ఇంతకాలం మాటలతో చెప్పిన చూసిన చంద్రబాబు.. ఇలా అయితే పని అవ్వడం లేదని గ్రహించి, యాక్షన్ లోకి దిగినట్లున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News