బీజేపీలో జనసేన విలీనం... ఈ ప్రచారంలో నిజమెంత ?
ఏపీలో బీజేపీ జనసేన కలసిపోయి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది టీడీపీలో కూడా ఆఫ్ ది రికార్డుగా చర్చ సీరియస్ గానే జరుగుతోంది అని అంటున్నారు.
ఏపీలో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఏర్పడిందా అంటే పుకార్లు అయితే అలా షికారు చేస్తున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయనకు ఒంట్లో బాగాలేదు అన్నది కూడా నిజం. అయితే ఇటీవల పవన్ ప్రాయశ్చిత్త దీక్ష, తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ తరువాత చంద్రబాబు పవన్ భేటీ అవలేదు అని అంటున్నారు.
ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చంద్రబాబు ఆరోపిస్తే ఆ మొత్తం వ్యవహారాన్ని పీక్స్ కి తీసుకుని వెళ్ళి పవన్ టీడీపీని ఇరకాటంలో పెట్టారని ప్రచారంలో మరో వార్త ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ప్లస్ బీజేపీ 2029 నాటికి ఏపీతో పాటు దక్షిణాదిన బలపడేలా కొత్త వ్యూహం రచిస్తున్నాయని అంటున్నారు.
అందుకే సనాతన ధర్మం అంటూ పవన్ ఒక అజెండా తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీ కూటమిలో కొనసాగితే ఇలాగే ఉంటుంది. అందుకే ఆయన ముఖ్యమంత్రిని చేసే బాధ్యతను బీజేపీ తీసుకుందని అంటున్నారు.
బీజేపీ అజెండాతో సౌత్ ఇండియాలో ఆ పార్టీకి ఒక బ్రాండ్ గా మారేందుకు పవన్ సిద్ధం అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో జనసేన విలీనం ప్రచారం ముందుకు వచ్చిందని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీని కొనసాగించడం ఈ రోజులలో కష్టం. వైసీపీ సైతం ఇపుడు ఓడాక తల్లకిందులు అవుతోంది.
టీడీపీ 2019లో ఓడాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అని చెబుతారు. ఈ నేపథ్యంలో జనసేనను విలీనం చేసే విషయంలో సేనాని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ చేస్తేనే మేలు అన్నది కూడా ఒక చర్చగా ఉందని అంటున్నారు. పవన్ చరిష్మాటిక్ లీడర్. ఆయన అండ ఉంటే దక్షిణాదిన బీజేపీ గట్టిగా నిలదొక్కుకోవచ్చు. ఇక పవన్ ని బీజేపీలో చేర్చుకుని 2029 నాటికి ఏపీలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ అని అంటున్నారు.
బీజేపీ వంటి ఒక పటిష్టమైన జాతీయ పార్టీ అండ ఉంటే పవన్ వంటి లీడర్ ఏకంగా తుఫాను కాదు సునామీయే అవుతారు అని కూడా అంటున్నారు. ఏపీలో అయితే రాజకీయ శూన్యత ఉంది, టీడీపీ వైసీపీలను జనాలు చూసేశారు. అందువల్ల ఆ రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే కనుక పవన్ సనాతన వాదం వెనక పెద్ద వ్యూహాలే ఉన్నాయని టీడీపీలో కూడా అంతతంతకు అనుమానాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. పవన్ బలమైన నాయకుడిగా రాజకీయంగా దీర్ఘకాలం కొనసాగాలీ అంటే బీజేపీలో జనసేనను విలీనం చేయడమే మంచి మార్గం అని కూడా అన్న వారు ఉన్నారు.
ఇక పవన్ ముందే ఈ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు ఉంచారు అని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇక బీజేపీలో పవన్ చేరితే ఆయనకు జాతీయ బాధ్యతలు అప్పగించాలని కూడా ఆ పార్టీ నేతలు ఒక స్కీం రెడీ చేసి పెట్టారని అంటున్నారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర బాధ్యతలు పవన్ కే ఇస్తారని అంటున్నారు.
ఏపీలో బీజేపీ జనసేన కలసిపోయి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది టీడీపీలో కూడా ఆఫ్ ది రికార్డుగా చర్చ సీరియస్ గానే జరుగుతోంది అని అంటున్నారు. బీజేపీకి రానున్న ఎన్నికల్లో దక్షిణాది చాలా ముఖ్యమని అంటున్నారు.
ఈసారి తెలంగాణాలో పాగా వేయాలని గట్టి పట్టుదలగా ఉంది. దానితో పాటు ఏపీని కూడా దక్కించుకోవాలని చూస్తోంది అంటున్నారు. అలాగే 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో బలం పుంజుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ జనసేన బీజేపీలో విలీనం అన్న ప్రచారం లో నిజమెంత ఉంది అన్నది తెలియదు కానీ పుకార్లు మాత్రం ఎద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. రేపటి రోజున ఏ సమీకరణలు మారుతాయో.