రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీఆర్ ఎస్-కాంగ్రెస్ వ్యూహాలు ఇవే!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.;
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాలు సుమారు 20 రోజుల వరకు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో సభలో ఎలా వ్యవహరించాలనే విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి.. శాసన సభ, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు.
వీరికి సభలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, సాగు, తాగు నీరు వంటి అంశాలను కార్నర్ చేయడంతోపాటు.. ఎస్ ఎల్ బీసీ టెన్నెల్‌లో చోటు చేసుకు న్న ఘటనను బలంగా తిప్పికొట్టాలని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభం అవుతున్న క్రమంలో నీటి సుదపాయాలు, చెరువుల విష యంలో సర్కారు ఉదాశీనంగా వ్యవహరిస్తోందని.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయా అంశాల ను సభలో ప్రస్తావించాలని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఇక, అధికార పక్షం కూడా సభ్యులతో భేటీ అయింది. బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ ప్రసాదరావు నేతృత్వం లో జరిగిన సమావేశంలో సభ్యులకు పలు అంశాలను దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షం దూకుడుకు అడ్డుక ట్ట వేయడంతోపాటు.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించిన ప్రగతి.. తీసుకురానున్న బిల్లులను కూడా ప్రస్తావించారు. ఇక, ప్రసాదరావు.. మాత్రం సభ ప్రాంగణంలో ఎక్కడా అల్లర్లు లేకుండా.. అలజడి లేకుం డా చూడాల్సిన బాధ్యతను స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న వాళ్ళ గురిం చి తాము మాట్లాడబోమని రాకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరెంటు, నీళ్లు, విద్య, ఉద్యోగం, రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాలపై తామే మాట్లాడతామని కూడా ఆయన స్పష్టం చేయ డం గమనార్హం. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు.. రేవంత్ రెడ్డి హయాంలో చేసిన అప్పులపై కూడా తామే చర్చించనున్నట్టు తెలిపారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు ఈ దఫా మరోసారి కత్తుల యుద్ధానికి వేదికగా మారనున్నాయి.