ఆ నలుగురిలో నడ్డా వారుసుడెవరో?

దేశంలో బీజేపీ హవా నడుస్తోంది. మూడో సారి అధికారంలోకి రావడమే కాదు 20కి పైగా రాష్ట్రాలు ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి.

Update: 2025-02-28 05:12 GMT

దేశంలో బీజేపీ హవా నడుస్తోంది. మూడో సారి అధికారంలోకి రావడమే కాదు 20కి పైగా రాష్ట్రాలు ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి. ఆ మూల ఈ మూల అని లేదు..ప్రతీ మూలన కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఈ విజయాలకు కారణం బలమైన సిద్ధాంత నిర్మాణంతో పాటు ప్రజాకర్షక నాయకత్వం అని చెప్పవచ్చు. మరో ఐదేండ్లు బీజేపీకి ఢోకా లేదు. ఆ పార్టీ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందనడంలో సందేహం లేదు. అలాంటి పార్టీకి నాయకత్వం వహించాలని తహతహలాడుతుంటారు ఆ పార్టీ నేతలు. ఈనేపథ్యంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. నడ్డా వారుసుడెవరు అనే ఉత్కంఠ ఆ పార్టీలో రోజురోజుకూ పెరిగిపోతోంది.

ప్రస్తుతం బీజేపీలో దేశ వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 15లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ పూర్తయ్యింది.

జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో బీజేపీ తమ యాక్షన్ ప్లాన్ ను వేగిరం చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది. మరో వైపు జాతీయ అధ్యక్ష పదవికి ప్రతిపాదిత పేర్లను సూచించాలని రాష్ట్రాల ఇన్ చార్జ్ లను కోరింది అధిష్ఠానం.

2020లో కమలం పార్టీ పగ్గాలు చేపట్టారు జేపీ నడ్డా. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన తన నాయకత్వంలో బీజేపీని మూడో సారి అధికారంలోకి తీసుకురావడం, వివిధ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మూడో సారి అధికారంలోకి రాగానే నడ్డాకు కేంద్రమంత్రి పదవి కూడా వరించింది. ఈకమ్రంలోనే పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను మరొకరికి అప్పగించనున్నారు.

అయితే ఈ పదవి ప్రస్తుతం ఎవరినీ వరిస్తుందోననే విషయంపై తీవ్ర ఆసక్తిని రేపుతోంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా..ఫైనల్ లిస్ట్ లో నలుగురు ఉంటారనే చర్చ నడుస్తోంది. ఆ నలుగురిలో.. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఒకరు అధ్యక్ష పదవిని చేపడుతారా..లేదా ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి. ఏదేమైనా మోదీ మనస్సులో ఉన్న వారికే అధ్యక్ష పీఠం అధిరోహించే అవకాశం ఉంటుందనేది బహిరంగ రహస్యమే.

Tags:    

Similar News