2025లో విమానం ఎక్కి 2024లో దిగాడు.. ఎలా సాధ్యం అంటే!

ఇలాంటివి టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ సినిమాలో చూస్తూ ఉంటాం.

Update: 2025-01-01 16:47 GMT

కాల గమనంలో 2024 సంవత్సరం కలిసి పోయింది. వెళ్లి పోయిన కాలం తిరిగి రాదు అంటారు. కానీ కొందరు మాత్రం 2025 సంవత్సరంలో అడుగు పెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుని కొన్ని గంటల తర్వాత తిరిగి 2024 సంవత్సరంకు వెళ్లారు. కొన్ని గంటల తర్వాత వారు తిరిగి 2025 సంవత్సరంలో అడుగు పెట్టారు. కొన్ని గంటల వ్యవధిలో వారు 2025లో అడుగు పెట్టారు, ఆ తర్వాత తిరిగి 2024కి వెళ్లారు, ఆ వెంటనే 2025కి చేరుకున్నారు. ఇలాంటివి టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ సినిమాలో చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇది జరిగింది. ఏకంగా ముందు సంవత్సరంకు వెళ్లిన ఘనత వారికి దక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హాంకాంగ్‌లో ఒక విమానం 2025 జనవరి 1 అర్థరాత్రి 12 గంటల 38 నిమిషాలకు లాస్ ఏంజిలిస్ కి ప్రయాణం అయ్యారు. హాంకాంగ్‌ విమానాశ్రయంలో వారు కొత్త సంవత్సరంకు స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్ట్‌లో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, కొందరు ఎయిర్ పోర్ట్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని కేక్‌లు కట్‌ చేశారు. న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టిన 38 నిమిషాల తర్వాత హాంకాంగ్‌ నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. లాస్ ఎంజిలిస్ కి కొన్ని గంటల తర్వాత ల్యాండ్‌ అయ్యారు.

ఆ విమానంలో ప్రయాణించిన వారు అంతా లాస్ ఎంజిలిస్‌లో ల్యాండ్‌ అయ్యేప్పటికి అక్కడ సమయం రాత్రి 8 గంటలు అయ్యింది. జనవరి 1వ తారీకు రాత్రి 8 గంటలు కాకుండా, 2024 డిసెంబర్ 31వ తారీకు రాత్రి 8 గంటలు అయ్యింది. అక్కడ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత మరోసారి ఆ విమానంలో ప్రయాణించిన వారు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. టైమ్‌ జోన్‌లు వేరు వేరుగా ఉండటం వల్ల ఒక్కో దేశంలో ఒక్కో సమయంకు కొత్త సంవత్సరం వస్తుంది అనే విషయం తెల్సిందే. కాలానికి ఎదురు వెళ్లడంతో ఆ విమాన ప్రయాణికులు రెండు దేశాల్లో రెండు సార్లు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

ఇలాంటివి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. అయితే సోషల్‌ మీడియాలో ఈసారి ప్రముఖంగా ఈ విషయం గురించి చర్చ జరుగుతూ వైరల్‌ అవుతోంది. హాంకాంగ్‌కి లాస్ ఎంజిలిస్‌కి మధ్య టైం వ్యత్యాసం 16 గంటలు ఉంది. అంటే లాస్ ఎంజిలిస్ కంటే 16 గంటల ముందు హాంకాంగ్‌లో న్యూ ఇయర్ వచ్చింది. హాంకాంగ్‌లో కొత్త సంవత్సర వేడుక జరుపుకున్న వారు విమానంలో లాస్ ఏంజిలిస్ కి వెళ్లి మళ్లీ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇది అరుదైన విషయం, ఆ ప్రయాణికులు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News