బాండ్లు-సంతకాలు.. ఏపీ ఎన్నికల ముచ్చట..!
ఇక అధికార పార్టీ కూడా.. ఎన్నికల సమయం వరకు కూర్చోకుం డా తన వ్యూహాలు తాను కూడా సిద్ధం చేసుకుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చే మార్చి రెండు లేదా మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అయితే.. ఇంత సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచేఏపీలో పొలిటికల్ సెగ మాత్రం రగులుకుంది. ప్రధాన ప్రతిపక్షాలు.. ఒక్కుమ్మడిగా అధికార పార్టీ వైసీపీపై విరు చుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇక అధికార పార్టీ కూడా.. ఎన్నికల సమయం వరకు కూర్చోకుం డా తన వ్యూహాలు తాను కూడా సిద్ధం చేసుకుంది.
వైసీపీ నేతలు, మంత్రులు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదోఒక పేరుతో నిరంతరం.. నాయకులను పార్టీ అధిష్టానం ప్రజల్లోకి పంపుతూనే ఉంది. ఇక, టీడీపీ నిన్న మొ న్నటి వరకు ఒంటరి పోరాటాలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు జనసేనతో కలిసి టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఉమ్మడి మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ఇక, ముందుముందు పూర్తస్థాయి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ మేనిఫెస్టోల విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం.. అందరినీ ఆశ్చ ర్యానికి గురి చేస్తున్న విషయం. ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మేనిఫె స్టోలోని అంశాలను.. ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలని అంశాలను కూడా.. టీడీపీ-జనసేన నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆయా పథకాలను కూడా వివరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.అయితే.. బాండ్లపై సంతకాలు చేస్తున్న విషయం మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ-జనసేన నాయకులు.. ప్రజలకు మేనిఫెస్టోపై వివరిస్తున్నారు. అదేసమయంలో బాండ్ పేపర్లను కూడా వారికి అందిస్తున్నారు.వీటిలో నమోదు చేసుకోవాలని లబ్ధిదారులను కూడా కోరుతున్నారు. ప్రజల పేర్లు, వివరాలను వారు నమోదు చేసుకుంటున్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే బాండ్ పేపర్‌లో పేర్కొన్న విధంగా ఆయా పథకాలను అమలు చేస్తామని ప్రజలకు చెబుతున్నారు.
సాధారణంగా ఎన్నికల్లో ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యే పార్టీలు అనేక హామీలు గుప్పిస్తాయి. అయితే.. ఇప్పుడు టీడీపీ-జనసేనలు బాండు హామీలు ప్రకటించడం.. ప్రజలకు వాటిని ఇవ్వడంనమోదు చేయించడం వంటివి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎంత వరకు ఆ పార్టీల కూటమికి మేలు చేస్తుందో చూడాలి.