తానాలో భారీ కుంభకోణం... తెరపైకి 3 మిలియన్ డాలర్ల వ్యవహరం!

అవును... తెలుసు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో సుమారు 25 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది.

Update: 2024-11-26 05:05 GMT

అమెరికాలోని ప్రముఖ తెలుసు అసోసియేషన్ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) లో సుమారు 3.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) భారీ కుంభకోణం జరిగిందంటూ మీడియాలో వస్తోన్న కథనాలు తీవ్ర సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడుస్తోంది.

అవును... తెలుసు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో సుమారు 25 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాజీ కోశాధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే.. ఇది ఒక్కరి వ్యవహారం కాదు.. మరికొంతమంది ఉండే అవకాశం ఉందనే చర్చా తెరపైకి వచ్చింది.

మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... 2022 సెప్టెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 27 మధ్య కాలంలో తానా ఫౌండేషన్ కు సంబంధించిన నిధులను ఎలాంటి అనుమతులు లేకుండా తన సొంత కంపెనీ ఖాతాలోకి తరలించారాంటూ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అభియోగాలపై శ్రీకాంత్ స్పందించారని అంటున్నారు.

ఇందులో భాగంగా... తానా సమావేశంలో చర్చించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే నిధులను దారి మళ్లించానని.. అది పూర్తిగా తన సొంత నిర్ణయమని.. దీనికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని.. ఈ మేరకు శ్రీకాంత్ పోలవరపు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారని తానా బోర్డు ఛైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తెలిపారు!

ఈ మేరకు నవంబర్ 25న జరిగిన బోర్డు సమావేశంలో... డిసెంబర్ 15 - 2024లోపు ఆ మొత్తాన్ని తిరిగి తానా ఖాతాలో జమ చేస్తానని శ్రీకాంత్ హామీ ఇచ్చారని అంటున్నారు.

Full View
Tags:    

Similar News