యూఎస్ లో మంచులో పడి తెలుగు విద్యార్థి మృతి... షాకింగ్ పిక్స్!

అమెరికాలో మృత్యువాత పడుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-25 07:37 GMT

అమెరికాలో మృత్యువాత పడుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. నూతన సంవత్సర వేడుకలు దగ్గరపడుతున్న వేళ ఈ నెలలో వరుస ప్రమాదాల్లో తెలుగు విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

అవును... అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవసాత్తు చనిపోయారు. అరిజోనాలోని కోకోనినో కౌంటీలో డిసెంబర్ 22న వుడ్స్ కాన్యన్ లేక్ వద్ద మంచులో పడిపోయాడు ఏపీకి చెందిన ఓ విద్యార్థి. దీంతో.. అతడు మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతుడిని అభిషేక్ సింగకొల్లిగా గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో మరుసటి రోజు (డిసెంబర్ 23) ఉదయం 10 గంటల తర్వాత ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోకోనినో కౌంటీ షెరీఫ్ కార్యాలయం ధృవీకరించింది. ఈ నెల 22 ఆదివారం మునిగిపోయిన బాధితుడు 26 ఏళ్ల అభిషేక్ సిగకొల్లిగా గుర్తించారని అంటున్నారు. అర్జిజోనా స్టేట్ యూనివర్శిటీలో పాఠశాలలకు హాజరు కావడానికి అభిషేక్ భారత్ నుంచి వచ్చారని చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో అభిషేక్ తో పాటు మరో ఇద్దరు కూడా మంచులో పడిపోయినప్పటికీ.. వారు సురక్షితంగా బయట పడగలిగారని అంటున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ తెరపైకి వచ్చాయి.

Tags:    

Similar News