స్వాగతించిన భారతీయులకే ట్రంప్ షాక్... మరోసారి తెరపైకి ఈసీఎఫ్ఆర్ సర్వే!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-27 12:30 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఇమ్మిగ్రేషన్స్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపట్ల భారతీయ సమాజం నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే... అదంతా ఇప్పుడు. గతంలో ట్రంప్ ను బలంగా వెల్ కం చేసినవారిలో భారతీయులే ఎక్కువ!

అవును... అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులను తీవ్ర టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. అక్రమ వలసదారుల సంగతి పక్కన పెడితే.. తాత్కాలిక వీసా అయిన హెచ్-1బీ వీసాదారులు, విద్యార్థులు, బీ1/బీ2 వీసాలపై వెళ్లినవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

ఈ సమయంలో గతంలో హల్ చల్ చేసిన ఈసీఎఫ్ఆర్ సర్వేపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఓ ఆసక్తికర సర్వే తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఈసీఎఫ్ఆర్) గ్లోబల్ సర్వే ఫలితలు తెరపైకి వచ్చాయి.

ఈ సర్వే ఫలితాల ప్రకారం... అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి రావడం వల్ల ప్రపంచ శాంతికి ప్రయోజనం చేకూరుతుందని.. ఇదే సమయంలో భారత్ - అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని మెజారిటీ భారతీయులు భావించారు! అయితే... పలు యూరోపియన్ దేశాలు మాత్రం సందేహం వ్యక్తం చేశాయి!

24 దేశాల్లో 28,000 మందికిపైగా నిర్వహించిన పోల్ లో ట్రంప్ తిరిగి రావడంపై ఆయా దేశాల ప్రజలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విషయంలో భారతీయులు 82శాతం మంది ట్రంప్ గెలుపు ప్రపంచ శాంతికి ప్రయోజనం అని, 84శాతం మంది భారత్ కు మంచిదని, 85 శాతం మంది అమెరికా పౌరులకు మంచిదని నమ్మారు!

అయితే దీనికి పూర్తి విరుద్ధంగా యూరోపియన్ దేశాలు స్పందించడం గమనార్హం. ఇందులో భాగంగా... యూకే వంటి దేశాలు ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. అయితే... ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు వచ్చిన ఈ సర్వే... ఇప్పుడు మరోసారి నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ట్రంప్ ను వెల్ కం చేసిన పర్సంటేజ్ లో మార్పులు ఏస్థాయిలో ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News