ఆర్థిక ఇబ్బందులే అమెరిాకాలో తెలుగు యువకుడి ప్రాణాలు తీశాయి
టెక్సాస్‌లో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.;
టెక్సాస్‌లో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. గుడివాడకు చెందిన అభిషేక్ కొల్లి అనే యువకుడు ప్రిన్స్‌టన్, టెక్సాస్‌లో శనివారం చివరిసారిగా కనిపించాడు. ఆదివారం అతని మృతదేహం కనుగొనబడింది.
అభిషేక్ చివరిసారిగా ఒక ప్రత్యేకమైన పసుపు రంగు దుస్తులు ధరించి కనిపించాడని నివేదికలు తెలిపాయి.జ అతని అదృశ్యం అతని కుటుంబ సభ్యులకు , స్నేహితులకు ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అధికారులు అభిషేక్ అదృశ్యంపై దర్యాప్తును చేపట్టారు. ప్రిన్స్‌టన్, టెక్సాస్ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతంగా గాలించారు. శోధన బృందాలను ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకులతో కలిసి పనిచేశారు. అనేక మంది నివాసితులు వారికి సాధ్యమైనంత సహాయం చేయడానికి ముందుకు రావడంతో ఎట్టకేలకు అభిషేక్ జాడ దొరికింది. అతడు ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా కనిపించాడు.
అతని సోదరుడు అరవింద్ కొల్లి గోఫండ్‌మీ ప్రచారాన్ని ప్రారంభించి ఈ విషాద వార్తను తెలియజేశాడు. అభిషేక్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నాడని ఆయన వెల్లడించారు. "అతను ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లో భయంకరమైన పరిణామం ఇది. అతనిపై పెరిగిన భారం అతనికి చాలా ఎక్కువైంది. చివరికి అతను తన ప్రాణాలను తీసుకునేలా చేసింది" అని అరవింద్ ఆ నిధుల సేకరణ పేజీలో రాశాడు.
"అభిషేక్ ధైర్యం ఉన్నప్పటికీ, ఆ కష్టాల బరువు అతనిని మా నుండి దూరం చేసింది, మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.. అతనిని వెంటాడిన ఆర్థిక ఒత్తిడినే అతడిని బలితీసుకుంది" అని ఆయన తెలిపారు.
అభిషేక్ కనిపించకుండా పోయిన తరువాత, ప్రిన్స్‌టన్, టెక్సాస్‌లోని స్థానిక అధికారులు, సంఘ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు అతడి మృతదేహం కనిపించింది. ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.