గ్రీన్ కార్డు.. హెచ్1బీ వీసాలున్న భారతీయులకు యూఎస్ తాజా అలెర్టు

రెండోసారి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అమెరికాలో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-03-25 05:00 GMT

రెండోసారి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అమెరికాలో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా.. వలసలపైనా యూఎస్ నజర్ మారింది. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన.. వారంతా ఎల్లకాలం అమెరికాలో ఉండే హక్కు లేదంటూ సంచలన వ్యాఖ్య చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి.

ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా కొన్ని వారాలుగా అమెరికా తన వలస చట్టాల్ని మరింత కఠినతరం చేయటంతో వలసదారుల్లో కొత్త గుబులకు కారణమవుతోంది. ఈ క్రమంలో యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు కీలక అడ్వైజరీని జారీ చేశారు.

హెచ్1బీ.. ఎఫ్1.. గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. వీరు అమెరికాకు వచ్చే సమయంలోనే.. తిరిగి వెళ్లే సమయంలో తనికీలు మరింత ఎక్కువగా ఉంటాయని.. సహనంగా ఉండాలని పేర్కొనటం చూస్తే.. వలసల విషయంలో అమెరికా ప్రభుత్వంలో మారిన తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాచ్చు. ఈ పరిణామాలు స్వదేశానికి వచ్చి వెళ్లే విషయంలో గతంలో మాదిరి స్వేచ్ఛగా ప్లాన్ చేసుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కచ్ఛితంగా ప్రవాస భారతీయులకు మరో పెద్ద సమస్యగా మారుతుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News