అమెరికా నుంచి హర్యానాకు మరో ఫ్లైట్... ఈ సారి ఎంతమందంటే..?

అక్రమ మార్గంలో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టిన వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-21 12:29 GMT

అక్రమ మార్గంలో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టిన వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ 2.0లో భాగంగా... అక్రమ వలసదారులు కనిపిస్తే చాలు ప్యాక్ చేసి, సైనిక విమానంలో ఎక్కించి, వారి వారి దేశాలకు పంపించేస్తున్నారు అమెరికా అధికారులు. ఈ సమయంలో భారత్ కు మరో విమానం రాబోతోంది!

అవును... అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులైన భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక సైనిక విమానంలో భారత్ కు విడతలవారీగా పంపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికా సైనిక విమానం హర్యానాలో ల్యాండ్ అవుతోంది. ఈ సమయంలో తాజాగా అక్రమ వలసలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. లిఖితపూర్వక సమాధానమిచ్చింది.

ఇందులో భాగంగా... అమెరికాలో చట్టవ్యతిరేకంగా నివాసం ఉంటున్న వారిలో మరో 295 మంది భారతీయులు త్వరలో స్వదేశానికి రానున్నారని.. ఈ మేరకు సంబంధిత ఏజెన్సీలు వారి వారి వివరాలను పరిశీలిస్తున్నాయని విదేశాంగశాఖ పేర్కొంది.

ఇదే సమయంలో... అమెరికా నుంచి భారత్ కు పంపబడుతోన వలసదారుల పట్ల అక్కడి అధికారులు వ్యవహరించిన తీరుపైనా కేంద్రం స్పందించింది. ఫిబ్రవరి 5న తొలిసారి భారత్ కు పంపించిన అక్రమ వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేయడం, గొలుసులతో కట్టిన విషయాన్ని లేవనెత్తినట్ల్లు తెలిపీంది. దీనికి అమెరికా కూడా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో... ఫిబ్రవరి 5న జరిగిన చర్య వల్ల భారత్ నుంచి వినిపించిన ఆందోళన తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పంపించిన వలసదారుల్లో మహిళలు, చిన్నరులకు సంకెళ్లు వేయలేదని అమెరికా ధృవీకరించిందని.. అదేవిధంగా... స్వదేశానికి చేరుకున్న వలసదారులతో చర్చించి మన అధికారులు కూడా దీన్ని కన్ ఫాం చేసుకున్నారని తెలిపింది.

కాగా... ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి సుమారు 388 మంది భారతదేశ అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానాల్లో వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా పంజాబ్ వాసులు 40% మంది.. హర్యానాకు చెందినవారు 34% మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలో మరో 295 మంది రానున్నారని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News