‘గోల్డ్ కార్డు’.. అమెరికా ట్రంప్ కార్డు.. మహా గిరాకీ.. ఒక్కరోజే 1000
అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అనేక దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ప్రవేశపెట్టిన వాటిలో కీలకమైనది ‘గోల్డ్ కార్డు’.;
అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అనేక దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ప్రవేశపెట్టిన వాటిలో కీలకమైనది ‘గోల్డ్ కార్డు’.
5 మిలియన్ డాలర్లు ఉంటే చాలు.. మీరు అమెరికా గోల్డ్ కార్డు జారీ చేసేలా ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇది పెట్టుబడిదారులను ఉద్దేశించి తీసుకొచ్చినది. దీనికోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చేసి ‘గోల్డ్ కార్డ్’ వీసాలను తీసుకొచ్చారు. ఈ వీసాలతో మరో గొప్ప మేలు ఏమంటే.. పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందే మార్గం సుగమం కావడం.
ట్రంప్ చెప్పడమే ఆలస్యం.. ఆపై రెండు వారాల్లో ఈబీ-5 వీసాలను ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’లతో భర్తీ చేశారు. గోల్డ్ కార్డు అంటే ఏమిటో కాదు.. శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ వంటిదే. ఈబీ-5 ప్రోగ్రామ్ కారణంగా జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తెచ్చారు. తద్వారా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడం సులువవనుంది.
గత నెలలో ట్రంప్ ప్రకటించిన తర్వాత చూస్తే ‘గోల్డ్ కార్డు’కు భారీ గిరాకీ కనిపిస్తోంది. ఒక్క రోజే వెయ్యి కార్డులను అమ్మడమే దీనికి నిదర్శనం.
5 మిలియన్ డాలర్లకు ఒక కార్డు కావడంతో 1000 గోల్డ్ కార్డుల ద్వారా 5 బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాకు సమకూరాయి. వీరే కాదు.. ఇంకా లక్షలాది మంది గోల్డ్ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారట.
ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందని
అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ తెలిపారు. దీనికి ఆయన చెప్పిన లెక్క ఏమంటే.. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని.. కనీసం 10 లక్షలమంది దీనిని కొంటారని ట్రంప్ అంచనా వేశారట.
ట్రంప్ ఆలోచనే..
గోల్డ్ కార్డు ఆలోచన ఎవరిదో కాదు.. స్వయంగా పెద్ద వ్యాపారి అయిన ట్రంప్ దేనట. ఆయన మనసులో మెదిలిన ఆలోచనేనట. లుట్నిక్ ఇటీవల మాట్లాడుతూ.. 2.5లక్షల మంది గోల్డ్ కార్డు కు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. కాగా, అమెరికా ప్రస్తుతం పెట్టుబడి వీసాగా ఈబీ-5ను జారీ చేస్తోంది. దీనిస్థానంలో తీసుకొచ్చిందే గోల్డ్ కార్డు. 5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగే నేరుగా అమెరికా పౌరసత్వం లభించే ఈ కార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించే వ్యూహం. ఈబీ-5 ప్రోగ్రామ్ లో జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టి చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు. ఈబీ-5 వీసాను అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలమది వీటిని పొందినా.. మోసాలు, అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి.