అమెరికాలో భారతీయం... ఆ విషయంలో టాప్-2 లో స్థానం!

ఇందులో భాగంగా... 49,700 మంది సహజీకృత పౌరసత్వం కింద అమెరికా సిటిజెన్ షిప్ దక్కించుకున్నారు.

Update: 2024-12-22 01:30 GMT

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది భారత్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయులు కీలక భూమిక పోషించారని అంటారు. ఈ నేపథ్యంలో... తాజాగా యూఎస్ విషయంలో భారత్ మరో రికార్డ్ సృష్టించింది.

అవును... సాధారణంగా ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్ కోసమో చాలా మంది అమెరికా వెళ్తుండగా.. మరికొంతమంది మాత్రం అక్కడే పౌరసత్వం సంపాదించుకోవాలని, శాస్వతంగా అక్కడే ఉండిపోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో గ్రీన్ కార్డ్ సంపాదించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంటారని అంటారు.

ఈ క్రమంలో... 2024 ఆర్థిక సంవత్సరానికి గాను అనేక మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇందులో భాగంగా... 49,700 మంది సహజీకృత పౌరసత్వం కింద అమెరికా సిటిజెన్ షిప్ దక్కించుకున్నారు. ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారిన జాబితాలో భారత్ రెండో అతిపెద్ద సమూహంగా నిలిచింది.

2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని పొందిన మొదటి ఐదు దేశాల్లో మెక్సికో మొదటి స్థానంలో నిలవగా... భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా... 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.1 శాతం మంది మెక్సికన్లకు అమెరికా గ్రీన్ కార్డు లభించగా... 6.1 శాతంతో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.

ఇదే సమయంలో మూడో స్థానంలో ఫిలిపీన్స్ 5.0 శాతంతో నిలవగా.. 4.9 శాతంతో డిమినికన్ రిపబ్లిక్, 4.1 శాతంతో ఐదో స్థానంలో వియత్నాం నిలిచాయి. అయితే... ఈ ఐదు దేశాల ప్రజలు.. అమెరికా పౌరుల్లో సుమారు 33 శాతం మంది కావడం గమనార్హం.

Tags:    

Similar News