అటు జగన్ ఇటు బాబు.. బీజేపీ ఎత్తులు ఎన్నో...!?
దానికి ఉదాహరణగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలసి వచ్చిన వెంటనే జగన్ ని కూడా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ తోనే ఉంది అని తెలుస్తోంది.ఆ పార్టీ టీడీపీ కూటమితో పొత్తులోకి వస్తున్నా వైసీపీతో కూడా తన సఖ్యతను చెడగొట్టుకోకుండా ఉండేలానే ఎత్తుగడలు వేస్తోంది అని అంటున్నారు. దానికి ఉదాహరణగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలసి వచ్చిన వెంటనే జగన్ ని కూడా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు.
ఏపీలో జగంతోనూ బాబుతోనూ కూడా బీజేపీ రాజకీయ దాగుడుమూతలు ఆడుతోందా అన్న చర్చ కూడా వస్తోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో ఏ పార్టీ గెలిచినా తమకు ఎంపీ సీట్లు దక్కాలని దూరాలోచన ఉంది అంటున్నారు. అలాగే రాజ్యసభలో ఈ రోజుకు వైసీపీకి మాత్రమే పూర్తి బలం ఉంది. ఏపీ నుంచి వచ్చే మొత్తం 11 ఎంపీ సీట్లు వైసీపీ ఖాతలఓనే ఉండబోతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచి మూడవ సారి అధికారంలోకి వచ్చినా కూడా రాజ్యసభలో వైసీపీ మద్దతు కావాలి కాబట్టి ఆ పార్టీతో మంచిగానే ఉండాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ చేరి తాము కోరుకున్న సీట్లు తీసుకుని ఈ పొత్తులో భాగంగా సొంతంగా ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకుంటే అవి తమకు ఉపయోగపడతాయని ఫుల్ హ్యాపీ అన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఉంది అని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటి అంటే ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లూ పొల్లుపోకుండా తమ ఖాతాలోనే పడాలన్నది బీజేపీ తెలివైన ఎత్తుగడ అని అంటున్నారు. అందుకే ఇన్నాళ్ళూ తామూ ఏ వైపు ఉండకుండా న్యూట్రల్ గా ఉండాలని అనుకున్నా టీడీపీ వైపు నుంచి వస్తున్న ఆహ్వానం కూడా బాగానే ఉందనిపించి బీజేపీ తన సొంత రాజకీయానికి తెర తీసింది అని అంటున్నారు.
ఇక్కడ బీజేపీ వరకూ బాగానే వ్యూహం ఉన్నా మరి పొత్తు పార్టీలకు బీజేపీ వల్ల లాభం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. ముఖ్యంగా జగన్ ను కట్టడి చేయాలని ఆయనకు ఎలక్షనీరింగ్ లో ఏ మాత్రం అవకాశం లేకుండా చేయాలని మొత్తం మీద తమదే పై చేయిగా ఉండాలన్న ఉద్దేశ్యంతో కొంత తగ్గి మరీ పొత్తుకు టీడీపీ వస్తోంది. మరి ఆ పార్టీ అనుకున్న విధంగా బీజేపీ చేస్తుందా అంటే అది ముందు ముందు చూడాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా ఒక్క మాట అయితే ఉంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ తాను అనుకున్న అధికార పీఠం దాకా చేరే వరకూ అటూ ఇటూ రెండు పార్టీల మధ్య ఘర్షణ అలాగే ఉండాలని కోరుకుంటుంది అని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ ఏపీ విషయంలో రానున్న రోజులలో చాలా ఎత్తుగడలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.
నిజానికి ఏపీలో బీజేపీ ప్లాన్స్ వేరుగా ఉన్నాయని అంటున్నారు. హంగ్ అసెంబ్లీ రావాలన్నదే బీజేపీ అజెండా అని కూడా వినిపిస్తోంది. మరి బీజేపీ ఎత్తులు కనుక అనుకున్నట్లుగా పారితే మాత్రం వైసీపీ టీడీపీ రెండింటికీ కూడా రాజకీయ షాకులు ఫ్యూచర్ లో తగిలే అవకాశాలు కూడా ఎవరూ కొట్టిపారేయడం లేదు అని అంటున్నారు.