ప్రియురాలిని ముక్కలుగా నరికిన ప్రియుడు.. తెరపైకి దారుణ విషయాలు!

అత్యంత ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే భార్య, కుమారుడు ఉన్న ఓ వ్యక్తి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

Update: 2024-11-28 07:53 GMT

అత్యంత ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే భార్య, కుమారుడు ఉన్న ఓ వ్యక్తి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరి మధ్యా సమస్యలు వచ్చాయి! దీంతో... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం అమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అడవిలోకి తీసుకెళ్లి పాతిపెట్టాడు!

అవును... జార్ఖండ్ లోని రాంచీలో అత్యంత దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిపై అఘాయిత్యం చేసి, గొంతు బిగించి హత్య చేసిన ప్రియుడు.. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ ముక్కల్ను సంచిలో తీసుకెళ్లి అడవిలో పాతిపెట్టాడు. తాజాగా ఈ విషయం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... నవంబర్ 24న రాంచీలో ఒక కుక్క మనిషి చేతిని నోటితో పట్టుకుని తిరుగుతోంది. ఇది చూసిన స్థానికులు ఆ కుక్క చెయ్యి తెచ్చిన ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశంలోని మట్టిని తొలగించడంతో అక్కడ ముక్కలు ముక్కలుగా నరికిన మనిషి శవం కనిపించింది. దీంతో.. షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ బ్యాగ్ లో ఉన్న ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ కేసును ఛేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం మొత్తం వెల్లడించాడని అంటున్నారు.

ఇందులో భాగంగా... తనకు, తన స్నేహితురాలికీ ఏడాదిన్నరగా ఎఫైర్ ఉందని.. ఆ సమయంలో తాను వేరే పెళ్లి చేసుకున్నానని.. దాన్ని తన ప్రియురాలు వ్యతిరేకించడంతో ఆమెను చంపానని.. ఆమె శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు 40 ముక్కలుగా నరికానని నిందితుడు పోలీసుల ముందు వెల్లడించాడని అంటున్నారు.

అలా ఆమెను హత్య చేసిన అనంతరం.. బెంగళూరులో ఉంటున్న తన భార్య, కుమారుడి వద్దకు వచ్చేసి ఉంటున్నాడట. ఈ సమయంలో తన కుమార్తె కనిపించడం లేదని.. ఇతడి ప్రియురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించగా... కుక్క నోటితో మనిషి చెయ్యి పట్టుకుని తిరుగుతున్న శవం వద్ద దొరికిన ఆధారాలతో ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు మ్యాచ్ అయినట్లు చెబుతున్నారు!

జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భగవాన్ పంజ్ టోంగ్రీలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News