అద్దెకు బాయ్ ఫ్రెండ్ వెనుక ఉన్న అసలు కారణం తెలుసా?
అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే ఓ ఆసక్తికరమైన, విచిత్రమైన సంస్కృతి ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే... ఈ కొత్త కల్చర్ వెనుక ఓ ఆసక్తికరమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు.
అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే ఓ ఆసక్తికరమైన, విచిత్రమైన సంస్కృతి ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే... ఈ కొత్త కల్చర్ వెనుక ఓ ఆసక్తికరమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. చాలా మంది ఊహించుకుంటున్నట్లు ఇది మరోరకం రిలేషన్ కాదని అంటున్నారు! ప్రస్తుతం వియాత్నాంలో ఇది అభివృద్ధి చెందుతోందని అంటున్నారు.
అవును... వియత్నాం దేశంలో ప్రస్తుతం చాలా విచిత్రమైన సంస్కృతి అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా... అక్కడి యువతులు అద్దెకు బాయ్ ఫ్రెండ్ లను తీసుకుంటున్నారు. అలా అని పబ్బులకో, క్లబ్బులకో సింగిల్ గా వెళ్లడానికి అనుమతిలేని చోటకు వెళ్లడం కోసం కాదు సుమా.. దానికో బాధ్యతతో కూడిన కారణం ఉందని అంటున్నారు.
వాస్తవానికి వియత్నాం దేశంలో ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారని.. ప్రధానంగా అమ్మాయిలు వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబాన్ని తల్లితండ్రులు కోరుకుంటారట. అయితే.. కెరీర్ పై దృష్టి సారించాలని కొంతమంది.. పెళ్లి తర్వాత స్వేచ్ఛ తగ్గుతుందనే భయంతో కొంతమంది యువతుల్లో ఉంటుందని చెబుతున్నారు.
పైగా.... వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోని యువతులను అక్కడ చాలా మంది అనుమానాలతో చూస్తారని చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ లను తీసుకోవడమే సరైన, ఏకైక పరిష్కారం అని ఆ దేశంలోని అమ్మాయిలు బలంగా భావిస్తున్నారని అంటున్నారు. పైగా ఈ ఆలోచనలో రిస్క్ పర్సంట్ జీరో అని చెబుతున్నారంట.
ఈ నిర్ణయం వల్ల అటు కుటుంబ నుంచి, ఇటు సమాజం నుంచి సమస్యలు తప్పుతాయి సరికదా.. యువతులు తమ కెరీర్ పై దృష్టి సారించవచ్చు అని చెబుతున్నారంట. దీనికి తోడు స్వేచ్ఛ బోనస్ అని అంటున్నారంట. పైగా ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ తో మరో రకం కమిట్ మెంట్స్ ఉండవని.. కేవలం అధికారికంగా పైకి కనిపించే బంధం మాత్రమే అని అంటున్నారంట.
అయితే.. ఈ పద్ధతి సరైంది కాదని, దీన్ని ప్రోత్సహించడం సహేతుకం కాదని.. అప్పటికి బాగున్నట్లు అనిపించినా ముందు ముందు సరికొత్త సమస్యలు వస్తాయని.. పైకి కనిపించే ప్రయోజనాల కంటే కనిపించని అప్రయోజనాలూ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారని అంటున్నారు.