బీ.ఎస్.ఎన్.ఎల్. సంచలన నిర్ణయం!
అధికారిక కారణాలు పూర్తిగా ప్రపంచానికి తెలియవు కానీ... పలు ప్రైవేటు రంగ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థలు అత్యంత వెనుబడి ఉంటుంటాయనే చర్చ జరుగుతుంటుంది.
అధికారిక కారణాలు పూర్తిగా ప్రపంచానికి తెలియవు కానీ... పలు ప్రైవేటు రంగ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థలు అత్యంత వెనుబడి ఉంటుంటాయనే చర్చ జరుగుతుంటుంది. ప్రధానంగా టెలికాం రంగంలో ఈ స్పష్టత మరింత స్పష్టంగా ఉంటుందని అంటారు. ఈ వాదనకు బలం చేకురుస్తూ తాజాగా బీ.ఎస్.ఎన్.ఎల్. సంచలన నిర్ణయం తీసుకుంది.
భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో లాభాల్లో దూసుకుపోతున్నాయనే చర్చ బలంగా వినిపిస్తుంటుంది. అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీ.ఎస్.ఎన్.ఎల్) మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఉందని చెబుతుంటారు. ఈ సమయంలో... దేశవ్యాప్తంగా తన ఆస్తులు అమ్ముకోవాలని ఫిక్సయ్యింది.
అవును... టెలికాం రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బీ.ఎస్.ఎన్.ఎల్. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఇప్పుడు ఆ సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు విక్రయించేందుకు, భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ బిల్డింగ్ లు, స్థలాలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న అస్తుల వివరాలు ప్రకటించింది! ఇందులో ఒక చోట ఖాళీ స్థలం ఉండగా.. మిగతా చోట్ల 470 భవనాలు ఉన్నాయని తెలిపింది. అయితే... ఉన్న పలంగా బీ.ఎస్.ఎన్.ఎల్. ఇలా ఆస్తులు అమ్ముకొవాలనే ఆలోచన ఎందుకు చేసిందంటే.. దానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.
ఇందులో భాగంగా... బీ.ఎస్.ఎన్.ఎల్. 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం పెట్టుబడులు అవసరం కావదంతో తమ సంస్థ స్థలాలు విక్రయించడం ద్వారా కొన్ని వనరులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీంతో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు ఈ పరిస్థితి రావడానికి కారణం.. ప్రైవేటు టెలికాం సంస్థల్లో ఉన్న కమిట్ మెంట్ కారణమా.. లేక, ప్రభుత్వ అలసత్వం కారణమా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి!