ఈ పిల్లాడి వయసు 10.. ఐక్యూ విషయంలో ఆ ఇద్దరిని దాటేశాడు!

తాజాగా ఈ ఇద్దరు మేధావులకు మించిన వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ బాలుడి బ్యాక్ గ్రౌండ్ భారత మూలాలు ఉండటం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-12-02 04:51 GMT

పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రపంచ మేధావులు ఐన్ స్టీన్..స్టీఫెన్ హాకింగ్. వారి పరిశోధనలు.. వారి మేధోతనం ప్రపంచ గతినే మార్చేసింది. మేధస్సులో వారి స్థాయి మరో లెవల్. అలాంటిది పదేళ్ల బుడతడి ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెంట్) తాజాగా ఈ ఇద్దరు మేధావులకు మించిన వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ బాలుడి బ్యాక్ గ్రౌండ్ భారత మూలాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ బుడతడు ఎవరు? ఎక్కడ ఉంటున్నారు? అతడి తల్లిదండ్రులు ఎవరన్న విషయాల్లోకి వెళితే..

పిట్ట కొంచెం.. కూత ఘనమన్నట్లుగా ఉంటుంది పదేళ్ల క్రిష్ అరోరా గురించి తెలిస్తే. ఇతనికి నాలుగేళ్ల వయసులో మొత్తం లెక్కల పుస్తకాన్ని మూడు గంటల్లో చదివేశాడు. ఎనిమిదేళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక రోజులో అవగాహన తెచ్చుకోవటంతో ఆశ్చర్యపోయారు. ఇతగాడికి మ్యాథ్స్ అంటే మహా ఇష్టంగా చెబుతారు. అందులోనూ ఆల్ జీబ్రాను ఆడేసుకుంటాడని చెబుతారు.

ఇతడి మేథోతనాన్ని పరీక్షించేందుకు ఐక్యూ పరీక్ష చేయగా.. పదేళ్ల ప్రాయంలోనే 162 ఐక్యూ స్కొర్ ను సాధించాడు. ఐక్యూ అధికంగా ఉండే వారికి మాత్రమే పరిమితమైన మేన్సా సొసైటీలో సభ్యుడు అయ్యాడు. ఇతగాడి ఐక్యూ లెవల్ ఐన్ స్టీన్.. స్టీఫెన్ హాకింగ్ ను మించిపోయిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. పియానో వాయించటంలోనూ ఈ పిల్లాడు దిట్టగా చెబుతున్నారు. భారత సంతతికి చెందిన క్రిష్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు.

Tags:    

Similar News