బాబు ముందు తమ్ముళ్ల డిమాండ్... చినబాబుకే పగ్గాలు!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Update: 2024-05-24 09:06 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ గ్యాప్ లో ఫలితాలపై రకరకాల ఊహాగాణాలు, విశ్లేషణలు, సెఫాలజిస్టుల అభిప్రాయాలు హల్ చల్ చేస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. .ఈ మేరకు సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

అవును... ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది తెలియాలంటే జూన్ 4న వచ్చే ఎగ్జాట్ ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే. ఈ లోపు పలు రకాల సర్వేల ఫలితాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు తెరపైకి వస్తూ గెలుపు వైసీపీదని ఒకరంటే.. కూటమిదే అని ఇంకొకరు చెబుతున్నా పరిస్థితి! ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి కచ్చితంగా వస్తుందని చెబుతూ.. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని అంటున్నారు టీడీపీ నేతలు.

ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ మేరకు బుద్దా వెంకన్న.. "ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్" అనే స్థాయిలో లోకేష్ కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంపై స్పందించారు.

కూటమి అధికారంలోకి వస్తే బాబు కేబినెట్ లోకి ప్రస్తుతం అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని తీసుకోవడం ఖాయమని.. ఫలితంగా ఈ పార్టీ అధ్యక్ష పదవిని లోకేష్ కు అప్పగించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు! మంగళగిరిలో ఫలితాలెలా ఉన్నా కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ కు మరోసారి మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు పార్టీ పగ్గాలు కూడా అప్పగించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి 2019లో పార్టీ అధికారం కోల్పోయాక కొంతకాలం స్థబ్ధగా ఉన్నా.. కరోనా టైం లో ఇంటికే పరిమితమైనట్లు కనిపించినా.. సుమారు గత రెండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం లోకేష్ అవిశ్రాంతంగా పని చేస్తూ వచ్చారనే చెప్పాలి. ప్రధానంగా “యువగళం” పాదయత్రతో ఆయన నేరుగా ప్రజలను కలిశారు.. యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. కేడర్ లో కొత్త ఉత్సాహం నింపారు!

ఈ సమయంలో చంద్రబాబు వయసులో పెద్దవారయ్యారు.. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఆయన ఆ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. నెక్స్ట్ జనరేషన్ కి పార్టీ బాధ్యతలు ఇవ్వడం వల్ల మరింత జోరుగా సైకిల్ ముందుకు కదిలే అవకాశం ఉందని అంటున్నారు! మరి తమ్ముళ్ల డిమాండ్ పై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!

Tags:    

Similar News