ఆ నలుగురు భారతీయుల మృతికి టెస్లా కారు వైఫల్యమే కారణమా?

సాంకేతికతకు, భద్రతకు మారు పేరని చెప్పే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కారు గత నెల 24న క్రాష్ అయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే

Update: 2024-11-14 04:42 GMT

సాంకేతికతకు, భద్రతకు మారు పేరని చెప్పే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కారు గత నెల 24న క్రాష్ అయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కెనడాలో టెస్లా కారు క్రాష్ అవ్వడంతో భారతదేశానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

కెనడాలోని టొరంటో సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ టెస్లా కారు డివైడర్ ను ఢీకొటడం... దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం.. ఆ మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు భారతీయులు మరణించడం తెలిసిందే. వీరంతా గుజరాత్ కు చెందిన వారు. వీరిలో ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. ఈ సమయంలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... తొరంటో కారు ప్రమాదంలో గుజరాత్ కు చెందిన నలుగురు భారతీయ స్నేహితులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సరికొత్త విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని రక్షించిన వ్యక్తి ఈ కారు డిజైన్ గురించి కీలక విషయాలు తెలిపారు!

కెనడా పోస్ట్ వర్కర్ అయిన రిక్ హార్పర్ ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మహిళను రక్షించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో లోపల నుంచి బాధిత మహిళ తలుపు తెరవలేకపోయిందని.. బయట నుంచి తాను కూడా తీవ్రంగా ప్రయత్నించినా కారు డోర్ ఓపెన్ కాలేదని వెల్లడించారు. ఇది డిజైన్ లోపమని అంటున్నారు.

ఇలా ఎంత ప్రయత్నించినా కారు డోర్ ఓపెన్ కాకపోవడానికి డిజైన్ లోపమే కారణమని అంటున్నారు. వాస్తవానికి ఎలక్ట్రిక్ కారు తలుపులు పవర్ పై ఆధారపడతాయి! అంటే... ఆ కారులోని బ్యాటరీ విఫలమైతే ఆ కారు డోరు కూడా ఓపెన్ కాదన్నమాట. ఇదే వారి మరణానికి కారణం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్.. టెస్లా మొడల్ వై లోని ఇతర భద్రతా సమస్యలను పరిశీలిస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా... ఈ కారుకు గతంలో జరిగిన ప్రమాదాలను పునఃపరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది టెస్లాపై ఉన్న విశ్వసనీయతపై సందేహాలను తెరపైకి తెచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News