అమెరికా వర్సెస్ కెనడా... జీ-7 గ్రూప్ మీటింగ్ లో ఇంట్రస్టింగ్ సీన్!

అవును... ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచీ కెనడాకు కొత్త కొత్త టెన్షన్స్ మొదలవుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-14 02:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో ప్రపంచంలోని మిగిలిన చాలా దేశాలకంటే ఎక్కువగా కెనడా ఇబ్బంది పడుతున్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాకు ట్రంప్ మాటలు, చేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జీ-7 గ్రూపు విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది.

అవును... ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచీ కెనడాకు కొత్త కొత్త టెన్షన్స్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. తొలుత అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడా నిలవాలంటూ ట్రంప్ పలుమార్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇక.. ఇటీవల సుంకాలతోనూ ట్రంప్ కెనడాకు వరుస షాకులిస్తున్న పరిస్థితి! ఈ సమయంలో జీ-7 గ్రూపు విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కెనడా మంత్రి మెలానియో జోలీ.. అమెరికా మంత్రి మార్కో రూబియో మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో తొలుత మాట్లాడిన కెనడా మంత్రి మెలానియో.. అమెరికాతో ముదురుతున్న ట్రేడ్ వార్ పై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం చర్యలతో ఎదురయ్యే పరిణామాలపై మిగిలిన దేశాలను హెచ్చరించారు.

అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన తమ పరిస్థితితే ఇలా ఉంటే.. ఇక ఎవరూ సురక్షితం కాదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో... అమెరికా చర్యలకు వ్యతిరేకంగా మిగిలిన మిత్రదేశాల మద్దతును కూడగట్టి ఎదుర్కొనేందుకు వీలుగా ఆమె ఈ చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో.. అమెరికా 51వ రాష్ట్రం అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపైనా జోలి స్పందించారు.

కెనడా అటువంటీ బెదిరింపులకు ఏమాత్రం వెనక్కి తగ్గదని.. యురోపియన్ యూనియన్ తో కలిసి యుద్ధవిన్యాసాలు చేయడం, ఆయుధ తయారీ వంటివి తమ సార్వభౌమత్వ రక్షణకు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో... అమెరికా మంత్రి మార్కో స్పందించారు. ఆర్థిక కోణంలో మాత్రమే కెనడాను 51వ రాష్ట్రం కావాలనేది ట్రంప్ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... కెనడా 51వ రాష్ట్రం అయితే అప్పుడు సరిహద్దుల గురించి, ఫెంటెనిల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ట్రంప్ భావన అని సర్దిచెప్పారు. జీ-7 సమావేశానికి ఉద్దేశించిన అంశాలపై దృష్టి పెట్టాలని.. అంతేకానీ, ఇది తాము కెనడాను ఆక్రమిస్తామని అన్నందుకు ఏర్పాటు చేసిన సమావేశం కాదని అన్నారు.

Tags:    

Similar News