గంటకు ఒకటి!... పోసానిపై రికార్డు స్థాయిలో ఫిర్యాదులు!

ఇదే సమయంలో... చాలా మందికి నోటీసులు అందాయని అంటున్నారు.

Update: 2024-11-15 15:19 GMT

గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం, జనసేన నాయకులను, వారి వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు, కామెంటులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన వ్యవహారలపై ఏపీ పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో... చాలా మందికి నోటీసులు అందాయని అంటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవీ పైనా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదవ్వగా.. ఇటీవల ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చారు. మరోపక్క శ్రీరెడ్డిపైనా వరుస ఫిర్యాదులు అందుతున్నాని అంటున్నారు ఈ సమయంలో పోసాని లెక్క వేరేగా ఉందని తెలుస్తోంది.

అవును... గత ప్రభుత్వ హయాంలో హద్దులు లేకుండా, సెన్సార్ లేకుండా, సభ్యత మరిచి, సంస్కారం విడిచి అన్న్నట్లుగా చెలరేగిపోయిన పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ నేతలు, సానుభూతిపరులపై ఏపీ పోలీస్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోసానిపై రికార్డ్ స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయని అంటున్నారు.

గతంలో వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్న పోసాని.. ఈ క్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు! ఆ రెండు సందర్భాల్లోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై విచ్చలవిడిగా అన్నట్లుగా చెలరేగిపోయారనే ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో ఒక్క రోజులోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 ఫిర్యాదులు అందాయని అంటున్నారు. వీటిలో పలు పోలీస్ స్టేషన్లలో ఒకే రోజు ఐదు కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఏ క్షణమైనా ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళి ఇంటి తలుపు తట్టే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

కాగా... బుధ, గురువారం నాటికే పోసానిపై రాజమండ్రి, విజయవాడల్లో పలు ఫిర్యాదులు అందినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 22 ఫిర్యాదులు అందాయని అంటున్నారు!

Tags:    

Similar News