సీఎం చంద్రబాబు సింప్లిసిటీ లెక్కే వేరు... వీడియో వైరల్!
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సింపుల్ గా ఉంటారనేది తెలిసిన విషయమే.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సింపుల్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. ఇటీవల.. తన కాళ్లకు ఎవరైనా నమస్కారం చేస్తే.. తాను కూడా వాళ్ల కాళ్లకు తిరిగి నమస్కారం చేస్తానని చెప్పి, ఆ ప్రయత్నం కూడా చేసి షాకిచ్చారు. ఇలా వీలైనంత సింపుల్ గా ఉండే చంద్రబాబు.. మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.
అవును... తాజాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. ఇందులో భాగంగా.. అక్కడ వేదికపై ఆయన కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీని.. ప్రత్యేకంగా అలంకరించండంపై అభ్యంతరం వక్తం చేశారు.
తాను కూర్చునే కుర్చీని ప్రత్యేకంగా అలంకరించడంపై స్పందించిన ఆయన... తాను కూర్చునే కుర్చీకి అదనపు హంగులు అవసరం లేదని.. అందరితో సమానంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆ కుర్చీపై వేసిన తెల్లటి గుడ్డను తీయించేశారు! దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నని అన్నారు. ఈ సందర్భంగా... అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసి.. ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఆటకట్టించారని అన్నారు.
ఇదే సమయంలో... సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ధీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టామని చెప్పిన చంద్రబాబు.. విశాఖలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులనూ చెల్లించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా.. తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరమని చెప్పిన బాబు.. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని.. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని సుచించారు.