బాబు కలల ప్రాజెక్టులకు వైసీపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా..!
సరే.. విషయం ఏంటంటే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా.. అమరావతి-బెంగళూరు, అమరావతి- హైదరాబాద్, అమరావతి-కలకత్తాలను కలుపుతూ.. భారీ ఎత్తున రహదారులను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు.
అవును.. ఇది వాస్తవమే! చంద్రబాబు కలల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం వైసీపీ కోర్టులోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించినప్ప టికీ.. అనేక విధాలుగా ప్రయత్నించి.. అడ్డుకునే ప్రయత్నం చేసినా.. చంద్రబాబు ఈ విషయంలో సక్సెస్ కాలేక పోయారు. ఏకంగా కేంద్రంలోని పెద్దలతోనే ఆయన వైసీపీ నేతల విషయంపై చర్చించినట్టు తెలిసింది. కానీ, చంద్రబాబు సూచనలు పెద్దగా పనిచేయలేదు.
సరే.. విషయం ఏంటంటే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా.. అమరావతి-బెంగళూరు, అమరావతి- హైదరాబాద్, అమరావతి-కలకత్తాలను కలుపుతూ.. భారీ ఎత్తున రహదారులను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు, అమరావతి టు అనంతపురం వరకు ఆరు లైన్లతో కూడిన రహదారిని కూడా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు కల. దీనికి అప్పట్లోనే బీజం పడింది. అయితే.. ప్రభుత్వం దిగిపోయి.. వైసీపీ వచ్చింది. తర్వాత అమరావతి పక్కకు జరిగిపోయింది.
ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాకతో.. పనులు పుంజుకున్నాయి. ఈ రహదారుల విషయం సీఎంకు ప్రతిష్టా త్మకంగా మారింది. కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. రాజధానికి నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం రహదారుల విషయాన్ని మాత్రం రాష్ట్రానికి వదిలేసింది. కానీ, ఇవి జాతీయ రహదారుల ను కలిపే ప్రాజెక్టులు కావడంతో నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని బాబు నిర్ణయించారు. ఇక, ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రహదారుల నిర్మాణ వ్యవహారం వైసీపీ నేతల కోర్టుకు చేరింది.
జాతీయ రహదారుల నిర్మాణం, ఏర్పాటు, ప్లానింగ్, అలైన్‌మెంట్ వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణ యం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కమిటీని వేసింది. దీనిని నేషనల్ హైవేస్ కన్సల్టిం గ్ కమిటీగా పిలుస్తారు. కొత్తగా ఎక్కడైనా జాతీయ రహదారి వేయాలని అనుకున్నప్పుడు ఈ కమిటీ చేసే సిఫారసులపైనే కేంద్రం ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ కమిటీలో ఏపీ నుంచి వైసీపీ ఎంపీలకు అవకాశం లభించింది. టీడీపీలో 16 మంది ఎంపీలు ఉన్నా.. వారికి వేరే చోట అవకాశం ఇచ్చారే తప్ప. హైవేల్లో రాలేదు.
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలకు చాన్స్ దక్కింది. వీరు ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులే కాకుండా..దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించి.. సిఫారసులు చేయనున్నారు. కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక.. కేంద్రం ఓకే చెప్పనుంది. అంటే.. ఒకరకంగా అమరావతి రహదారి ప్రాజెక్టులు ముందుకు వెళ్లాలా? వద్దా? అనేది వీరి నిర్ణయంపైనే వీరి సిఫారసులపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఒకరకంగా చంద్రబాబు కలల ప్రాజెక్టులు ముందుకు సాగేందుకు.. కీలకంగా మారింది. మరి వారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే.. బాబు కలలు సాకారం అవుతాయి. లేకపోతే.. ఇబ్బందులు తప్పవు. మరి ఏం జరుగుతుందో చూడాలి.