ఆసక్తికరం... పెరుగుతున్న చంద్రబాబు అనుభవంపై పవన్ అభిమానం!

అవును... "పల్లె పండుగ" వారోత్సవాలని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అనంతర జరిగిన సభలో ప్రసంగించారు.

Update: 2024-10-14 13:04 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ" వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కృష్ణాజిల్లా కంకిపాడులో ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన పవన్.. చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు.

అవును... "పల్లె పండుగ" వారోత్సవాలని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అనంతర జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై ఆయనకున్న నమ్మకాన్ని.. బాబు అనుభవంపై తనకున్న గౌరవాన్ని మరోసారి వివరించారు. ఇందులో భాగంగా... నాలుగో దఫా సీఎంగా ఉన్న చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇదే సమయంలో... నాయకుడి కష్టం, అనుభవం రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగించుకోకపోతే తప్పు చేసినవాళ్లం అవుతామని.. చంద్రబాబు అపారమైన అనుభవమే రాష్ట్రానికి బలమని.. అందుకె ఆ రోజు కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని.. నాడు తీసుకున్న ఆ నిర్ణయం నేడు సరైనదేనని అనిపిస్తోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

క్యాబినెట్ సహా అధికారులతో జరిగే సమావేశాల్లో వివిధ అంశాలపై చంద్రబాబు చాలా బలంగా మాట్లాడుతుంటారని.. శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై అధికారులకూ దిశానిర్ధేశం చేతుంటారని పవన్ చెప్పుకొచ్చారు! ఇదే క్రమంలో... కొన్ని అభివృద్ధి పనులు చేసేటప్పుడు పంచాయతీరాజ్ శాఖ చాలా శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఇక ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని.. దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారని.. ఇప్పటికే పంచాయతీ తీర్మానాలు చేసిన పనులకు పరిపాలన, సాంకేతిక ఆమోదం ఇచ్చామని.. సుమారు రూ.4,500 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News