వైరల్... వితౌట్ వీడియోగ్రాఫర్ 'ఏఐ'తో చంద్రబాబు ప్రెస్ మీట్!

నాడు ఐటీ - నేడు ఏఐ అంటూ యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాజాగా ఏఐ టెక్నాలజీని వాడి చూపించారు.

Update: 2025-01-26 05:10 GMT

ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హల్ చల్ చేస్తోందని.. భవిష్యత్తు అంతా ఈ రంగానిదే అని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మారుస్తానని చెబుతున్నారు. నాడు ఐటీ - నేడు ఏఐ అంటూ యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాజాగా ఏఐ టెక్నాలజీని వాడి చూపించారు.

 

అవును... టెక్నాలజీ వినియోగం విషయంలో ముందుండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని ఉపయోగించుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. వీడియోగ్రాఫర్లు లేకుండా, కెమెరామెన్స్ కనిపించకుండా.. ఏఐతో పనిచేసే వ్యవస్థను వినియోగించి వినూత్నంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... తన నివాసంలో 4 కెమెరాలతో మల్టీవీడియో కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా లైవ్ కవరేజ్ అందించారు. ఈ సమయంలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ కెమెరాకు సూచనలు ఇవ్వడంతో.. అది ఆయనను కేంద్రంగా చేసుకుంటూ వీడియో రికార్డింగ్ మొదలుపెట్టింది. ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ అదే చూసుకుని ఔట్ పుట్ ఇచ్చింది.

అంటే... 8 మందితో చేసే పని ఈ ఏఐ కెమెరా వ్యవస్థ ద్వార ఒక్కరితోనే చేయొచ్చన్నమాట! నో మ్యాన్ విధానంలో ఇది ఆటోమేటిక్ గా పని చేస్తుంది. తాజాగా దావోస్ పర్యటన విశేషాలు చెప్పేందుకు ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు.. ఇందులో ఇలా ఏఐ టెక్నాలజీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయించారు.

ఇక.. దావోస్ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలను వివరించిన చంద్రబాబు.. ఆ పర్యటనలో తాను 27 ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ తో పాటు 4 రౌండ్ టేబుల్ సదస్సులు, 3 కాంగ్రెస్ సెషన్స్ తో పాటు యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ జనరల్ తో ఒక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏఐ, గ్రీన్ ఎనర్జీ పేర్లు మారుమోగుతున్నాయని అన్నారు.

ఇక.. దావోస్ వెళ్లేది ప్రధానంగా మన రాష్ట్ర బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి, నెట్ వర్కింగ్ పెంచుకోవడం కోసమేనని చెప్పిన చంద్రబాబు.. ఇక్కడ కంపెనీల్ని దావోస్ కు తీసుకెళ్లి అక్కడ ఎంఓయూలు చేసుకోవడంలో అర్ధం లేదని అన్నారు.

Tags:    

Similar News