బీజేపీ వక్ఫ్ బిల్లు...బాబుకు అగ్ని పరీక్ష !
కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి వక్ఫ్ బిల్లు చాలా ముఖ్యమైనది.
కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి వక్ఫ్ బిల్లు చాలా ముఖ్యమైనది. ఈ బిల్లుకు చట్ట సవరణలు చేసి పార్లమెంట్ లో తొందరగా ఆమోదించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. నవంబర్ లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో వక్ఫ్ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
లోక్ సభలో రాజ్యసభలో ఇపుడు మెజారిటీ ఉన్నందువల్ల బీజేపీ ఈ బిల్లుని ఆమోదించుకునేందుకే మొగ్గు చూపిస్తుంది అని అంటున్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీయే సర్కార్ వక్ఫ్ బిల్లుతో కూటమి మిత్రులకు పరీక్షనే పెట్టింది.
ఆనాడు టీడీపీ ఈ బిల్లు విషయంలో ఏమీ చెప్పలేకపోయింది. ఇక నాడు విపక్షాల ఆందోళన నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు వెళ్ళినా ఇపుడు జేపీసీ అభిప్రాయ సేకరణ అన్నది కూడా ఒక ప్రహసనం అని వక్ఫ్ బిల్లుకు చట్ట సవరణలు ప్రతిపాదించడానికే ఇదంతా అని అంటున్నారు.
ఈ చట్టానికి 119 సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అంటున్నారు.ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టం అయితే ముస్లిం మైనారిటీల వక్ఫ్ ఆస్తులు ఏవీ మిగలవు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ బిల్లు మీద విపక్షాలే కాదు ముస్లిం మైనారిటీలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు ఆమోదిస్తే రిజిష్టర్ అయిన ఆస్తులే వక్ఫ్ బోర్డుకు ఉంటాయి తప్ప మిగిలినవి అన్నీ వివాదాలలోకి వస్తాయని అంటున్నారు. దాని వల్ల మరిన్ని కొత్త సమస్యలు ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇక ఈ వక్ఫ్ బోర్డు ఏమిటి ఆస్తులు ఏమిటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం కంటే ముందు నుంచే ముస్లిమ్స్ లోని సంపన్నులు తన ఆదాయన్ని కొంత వక్ఫ్ బోర్డుకు ఇస్తే ఆ ఆదాయం నుంచి ఆ వర్గంలోని పేదలకు విద్య ఇతర సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు.
ఈ వక్ఫ్ బోర్డులను ముస్లిముల భాగస్వామ్యంతో ప్రభుత్వ నిర్వహణలో ఇంతవరకూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చారని ఇపుడు అలా కాకుండా అవన్నీ వివాదాలలో పడితే ఇబ్బందులే కాకుండా సామాజిక అశాంతి చెలరేగుతుందని వారు కలవరపడుతున్నారు. ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమొదించరాదని వారు కోరుతున్నారు
ఇక్కడే టీడీపీ అధినాయకత్వానికి పెద్ద చిక్కు వచ్చిపడుతోంది. టీడీపీ మద్దతు తీసుకుని ఈ బిల్లుని ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ అవసరం టీడీపీకి ఉంది. దాంతో టీడీపీ తన పార్టీ ఫిలాసఫీ మేరకు మైనారిటీలకు రక్షణగా నిలుస్తుందా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీపీఐ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. వక్ఫ్ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకుండా ఎన్డీయే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అందులో ఆయన కోరారు. మరి చంద్రబాబు ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించగలరా దాని కంటే ముందు తాను వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పగలరా అన్నది ఇపుడు చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జ్రుగుతుందో.