ముగ్గురు నాయకులు మూడు చోట్ల వ్యాఖ్యలు
భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది వారు చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలు సహజంగా వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో దడపుట్టిస్తున్నాయి.
ఒకే రోజు.. ఒకే సమయం.. ఒకే విషయం.. కాకపోతే.. ఒకరు గంభీరంగా చెప్పుకొచ్చారు. మరికొందరు సుతిమె త్తగా చెప్పారు. ఇంకొకరు.. నాటుగా మాట్లాడారు. అదే.. ప్రతిపక్షం వైసీపీకి వార్నింగ్ ఇవ్వడం. నేరుగా పేరు పేట్టేసి మరీ రాష్ట్రంలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు నాయకులు హెచ్చరికలు జారీ చేయడం రాజకీ యంగా చర్చనీయాంశం అయింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది వారు చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలు సహజంగా వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో దడపుట్టిస్తున్నాయి.
అసలు ఏం జరిగింది?
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రాష్ట్రంలో ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పం పిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం శ్రీకాకుళంలో పాల్గొంటే, పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరిలో పాల్గొ న్నా రు. అయితే.. అనూహ్యంగా ఇద్దరి నోటి నుంచి కూడా వైసీపీకి హెచ్చరికలే రావడం గమనార్హం. అటు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదంటూ.. గట్టిగానే హెచ్చరించా రు.
వైసీపీ నేతల పేర్లు చెప్పలేదు కానీ.. పరోక్షంగా ఆయన ధర్మాన బ్రదర్స్, తమ్మినేని సీతారాం సహా వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఇక, ఇదే సమయంలో ఇటు పవన్ కల్యాణ్ కూడా.. వార్నింగ్ ఇచ్చేశారు. 'మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు. తొక్కి నారా తీస్తా' అని హెచ్చరిం చారు. వైసీపీ నాయకులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇద్దరు నాయకులు కూడా చాలా బలంగానే హెచ్చరికలు పంపారు.
ఇక, ఇదే సమయంలో అమెరికాలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా.. వైసీపీ నాయకులకు సినిమా చూపి స్తానంటూ.. వ్యాఖ్యానించడం గమనార్హం. రెడ్ బుక్‌లో చాప్టర్ 3ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మొత్తం గా చూస్తే.. ముగ్గురు నాయకులు మూడు చోట్ల వ్యాఖ్యలు చేసినా.. ఇవేవీ యాదృచ్ఛికంగా అయితే వారు మాట్లాడినట్టుగా చూడలేం. పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నారని అనిపిస్తోంది. అంటే.. వైసీపీ నేతలను మరిన్ని కేసులు చుట్టుముట్టడమో.. లేక.. మరేదైనా ఇరకాటంలోకి నెట్టడమో కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.