ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఫలితం మార్చేది వారేనా ?
ఇక రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదే శ్రీనివాసనాయుడుని తక్కువ అంచనా వేయడానికి లేదు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఆయనకు ఉంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరి కొద్ది గంటలలో జరగబోతున్నాయి. ప్రచారం మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పీక్స్ లోకి వెళ్ళింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ 6 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని మరో చాన్స్ కోరుకుంటున్నారు. ఆయనకు టీడీపీ కూటమి మద్దతు ప్రకటించింది. దాంతో గట్టిగానే పోటీలో ఉన్నారు.
ఇక రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదే శ్రీనివాసనాయుడుని తక్కువ అంచనా వేయడానికి లేదు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఆయనకు ఉంది. దాంతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఎన్నికల వ్యూహాలు ఉండనే ఉన్నాయి. ఆయనకు బీజేపీ మొదట్లో మద్దతు ఇచ్చింది. కానీ ఇపుడు కూటమి పార్టీలు రఘువర్మకే సపోర్టు అని అంటున్నాయి.
అదే విధంగా ఈసారి ఒక మహిళా అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుని పోయారు. ఆమె విజయగౌరి. యూటీఎఫ్ నుంచి ఆమె బరిలో ఉన్నారు. యూటీఎఫ్ అంటే వామపక్ష అనుబంధ ఉద్యోగ సంస్థగా గుర్తింపు ఉంది. ఉత్తరాంధ్రాలో యూటీఎఫ్ ని బలం హెచ్చుగా ఉంటుంది అని చెబుతారు. ఒక్క ఓటూ పొల్లు పోనీయకుండా వేసుకునే నేర్పూ ఓర్పూ యూటీఎఫ్ కి ఉందని అంటారు.
ఇక విజయగౌరికి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఆమె మహిళగా పోటీలో ఉండడం. ఆమె ప్రత్యర్ధులు అయిన రఘువర్మ గాదె శ్రీనివాసులునాయుడు ఇద్దరినీ ఉపాధ్యాయులు ఇప్పటికే చూసేశారు. వారి పనితీరు గురించి పూర్తి అవగాహన ఉంది. దాంతో విజయగౌరి ఫ్రెష్ అన్న ఆలోచనతో ఆమె ఏమి చేస్తుందో అన్న ఉత్కంఠతో ఒక చాన్స్ ఇస్తే మాత్రం ఆమె కొత్త ఎమ్మెల్సీ అవుతారు. ఇది ఆమెకు అనుకూలించే అంశం.
అంతే కాకుండా విజయగౌరి ఉపాధ్యాయ ఉద్యమంలో చాలా ఎక్కువగా పాలొంటారు. ఆమె నాయకత్వ లక్షణాల గురించి అందరికీ తెలుసు. ఉత్తరాంధ్రాలో మొత్తం ఉపాధ్యాయ ఓట్లు 22 వేల 493 ఉంటే అందులో అత్యధిక శాతం మహిళా టీచర్లు ఉన్నారు. ఈ సెక్షన్ లో మొగ్గు కనుక ఆమె వైపు తిరిగితే మహిళా ఎమ్మెల్సీ మాకు కావాలని అనుకుంటే కచ్చితంగా ఆమెకే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
ప్రస్తుతానికి చూస్తే ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోరు ఉంది. వీరి వెనక మూడు బలమైన ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. అలా సాలిడ్ ఓట్లు వీరికి ఉన్నాయి. అయితే వీరిలో ఎవరికి టీచర్లు పట్టం కడుతారు అన్నది చూడాలి రఘువర్మకు కూటమి మద్దతుగా నిలిస్తే విజయగౌరికి వైసీపీ మద్దతుగా ఉంటోందని ప్రచారం సాగుతోంది. దాంతో ఈ గెలుపు వెనక కూడా రాజకీయ సమీకరణలు లెక్కలు చాలానే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.