చంద్రబాబు కిం కర్తవ్యం.. జగన్ స్ట్రాటజీ .. !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మార్చిన విషయం తెలిసిందే. ఇక, నుంచి ఆయన న్యాయ పోరాటానికే మొగ్గు చూపుతున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మార్చిన విషయం తెలిసిందే. ఇక, నుంచి ఆయన న్యాయ పోరాటానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా తన పరువు తీస్తున్నారంటూ.. ఓ రెండు పత్రికలపై ఢిల్లీ కోర్టులో కేసులు వేయడం.. పరువు నష్టం కింద రూ.100 కోట్లు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే..ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. ఎందుకంటే.. పారిశ్రామిక వేత్త అదానీ వ్యవహారంలో జగన్ లంచాలు తీసుకున్నారనేది ఆ పత్రికలు చేసిన ఆరోపణ. ఇదే జగన్ హైకోర్టుకు వెళ్లే వరకు తెచ్చింది. దీనిలో ఆయన పత్రికలనే టార్గెట్ చేసినా.. పరిణామాలు మాత్రం సర్కారు వరకు వస్తున్నాయి.
అదానీకి, జగన్‌కు మధ్య లంచాల వ్యవహారం సాగి.. ప్రజలపై భారం పడుతుంటే.. సర్కారు ఏం చేస్తోందన్న విమర్శలు సోషల్ మీడియాలో జోరుగానే వినిపిస్తున్నాయి. పోనీ .. సోషల్ మీడియాను పక్కన పెట్టినా.. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదానీ వ్యవహారంలో లంచాలు ఉన్నట్టు తేలినప్పుడు సదరు ఒప్పందాలను సర్కారు రద్దు చేయొచ్చుకదా! అనే అంశంపై జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో లేవనెత్తడం ద్వారా.. ఈ కేసును మరో మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఈ విషయం కూటమి సర్కారుకు అంత ఈజీ అయితే కాదు. జగన్‌పై విమర్శలు చేసినంత ఈజీగా అదానీపై విమ ర్శలు చేసే అవకాశం లేదు. వాస్తవానికి ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని.. జగన్ న్యాయ పోరాటం చేస్తారని కూడా ఆలోచించ లేదు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతరులు మాత్రమే ఈ విషయంపై స్పందించారు. కానీ, ఆ రెండు పత్రికలు మాత్రం దూకుడుగా వ్యవహరించాయన్న చర్చ కూటమి పార్టీల నేతల మధ్య సాగుతోంది. ఇప్పుడు హైకోర్టులో జగన్ తరఫున న్యాయవాదులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అయితే..ఇక్కడ కూడా సర్కారుకు రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయి. 1) లంచాలుతీసుకున్నారని జగన్‌పై కోర్టుకు చెబితే.. ఎవరు ఇచ్చారనే చర్చ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గానే.. అదానీ పేరు తెరమీదికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది.. కూటమికి ఇస్టం లేదు. ఇక, 2) అసలు ఈ వ్యవహారంలో జగన్‌పాత్ర లేదని అంటే.. అలాంటప్పుడు.. ఆ రెండు పత్రికలు కూడా ఇబ్బందుల్లో కూరుకుపోతాయి. ఏమీ లేనప్పుడు..ఎలా వ్యతిరేక వార్తలురాశారనే చర్చ వస్తుంది. సో.. ఈ రెండు అంశాల ఆధారంగానే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కేసును యూటర్న్ తిప్పాలని జగన్ తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి సర్కారుకు ముఖ్యంగా చంద్రబాబుకు ఒకింత తలనొప్పులు ఏర్పడుతున్నాయని అంటున్నారు న్యాయనిపుణులు.