కాలం తెచ్చిన మార్పు.. పదేళ్లలో చంద్రబాబులో ఛేంజ్ ఇంతనా?

కాలం చాలా సిత్రమైనది. పరీక్ష పెట్టే వేళలో కామ్ గా ఉండి.. తనదైన టైం కోసం వెయిట్ చేయాలే కానీ.. ఆ ఓపికకు కాలం సైతం కరుగుతుంది. పరీక్ష పెట్టిన టైం తన తీరును మార్చుకొని పాతాళానికి పడిపోయిన గ్రాఫ్ ను పైకి లేపుతుంది.

Update: 2024-06-06 04:12 GMT

కాలం చాలా సిత్రమైనది. పరీక్ష పెట్టే వేళలో కామ్ గా ఉండి.. తనదైన టైం కోసం వెయిట్ చేయాలే కానీ.. ఆ ఓపికకు కాలం సైతం కరుగుతుంది. పరీక్ష పెట్టిన టైం తన తీరును మార్చుకొని పాతాళానికి పడిపోయిన గ్రాఫ్ ను పైకి లేపుతుంది. అందనంత స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇందుకు కాలం కోసం వెయిట్ చేయకుండా.. తమ ప్రయత్నం తాము చేస్తే మరెక్కడికో వెళ్లిపోవటం ఖాయం. ఈ మాటల్ని చదివినప్పుడు చప్పున గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ జాతీయ రథసారధి నారా చంద్రబాబు నాయుడు. ఏపీతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రాధాన్యం ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన మాట కోసం.. ఆయన టైం కోసం తపిస్తున్న వారెందరో.


ఒకప్పుడు తనకు తానుగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి.. టైం అడిగితే కుదరదని ముఖం మీదనే చెప్పేసిన వారు సైతం.. ఇప్పుడు ఆయన టైం తమకు కాసింత ఇస్తే బాగుండనుకుంటున్నారు. కాలం తీసుకొచ్చిన మార్పులు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గతంలో మాదిరి.. జాతీయస్థాయిలో చక్రం తిప్పాలన్న ఆసక్తి ఆయనలో పెద్దగా లేదు. ఆ విషయాల మీద అంత ఆసక్తిని చూపట్లేదు. తాజా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు తీరును.. ఆయన బాడీ లాంగ్వేజ్ ను చూస్తే ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

కాస్త రీవైండ్ చేసుకొని 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. కూటమి మిత్రుడైన మోడీ జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న వేళ.. ఆయన ప్రభుత్వంలో తాను కీలక భూమిక పోషించాలని తపించిన చంద్రబాబు ఎంత ఉత్సాహంగా తన ఆలోచనల్ని షేర్ చేసుకున్నారో గుర్తు తెచ్చుకొని.. తాజాగా ఆయన స్పందిస్తున్న తీరుచూస్తే.. కాలం ఆయనలో చాలానే మార్పులు తెచ్చిందని చెప్పాలి.

అంతేనా.. 2014లో విజయం సాధించిన తర్వాత.. ఢిల్లీకి వెళ్లిన ఆయన మోడీని కలిసిన సందర్భంగా ఆయనకు ఎదురెళ్లి హగ్ చేసుకునే ప్రయత్నం చేస్తే.. మోడీ పెద్దగా పట్టించుకోకపోవటం.. తన చేతలతో చంద్రబాబు స్థాయిని గుర్తు చేస్తూ.. కాస్తంత దూరం పెట్టటం.. కొద్ది వారాలకే ఢిల్లీలో తాను తిప్పాలనుకున్న చక్రం తాను తిప్పలేనన్న విషయాన్ని అర్థం చేసుకోవటం చరిత్రే. దాన్ని ఇప్పటికిప్పుడు మర్చిపోలేం.

గడిచిన పదేళ్లలో చంద్రబాబు చూడని కష్టం లేదు. ఎదురుకాని అవమానం లేదు. దేశంలో మరే అధినేత పడనన్ని ఇబ్బందుల్ని ఆయనీ పదేళ్లలో ఎదుర్కొన్నారు. గెలుపు మాత్రమే తన పరిస్థితుల్ని మారుస్తుందని నమ్మిన ఆయన.. డెబ్భై ప్లస్ వయసులో పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చింది. గతంలో చంద్రబాబులో ఒకలాంటి ఉత్సాహం ఉండేది. తన గొప్పతనాన్ని ప్రదర్శించాలన్న చిన్నపిల్లాడితత్త్వం ఉండేది. అదిప్పుడు ఆయనలో పూర్తిగా కరిగిపోయింది.

విపక్షంలో ఉండి.. జైలుకు వెళ్లి.. అక్కడి పడిన కష్టం కావొచ్చు. ఆ టైంలో తన కోసం తపించిన వారి గురించి ఆయన ఎలా మర్చిపోగలరు? మొన్నటి వరకు తనను పట్టించుకోని వారు..ఇప్పుడు మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ సగౌరవంగా ఆహ్వానిస్తున్న వేళలోనూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా బాబు వ్యవహరశైలి కనిపిస్తుంది. గతంలో మాదిరి అదే పనిగా మీడియాతో మాట్లాడటం మానేసి.. చేతల్లో చూపిస్తున్న వైనం చూసినప్పుటు అనిపించేది ఒక్కటే..పదేళ్లలో బాబులో చాలా మార్పు వచ్చిందన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఈ వయసులోనూ ఆ మాత్రం మెచ్యురిటీ సాధించకుండా ఎందుకు ఉంటారు చెప్పండి?

Tags:    

Similar News