పదేళ్ళ తరువాత పవన్ ఇంటికి బాబు...!
దాదాపు పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
దాదాపు పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా కలకలం రేపుతోంది. చంద్రబాబు 2014 మొదట్లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అప్పట్లో విభజన ఏపీలో అధికారం కోసం పవన్ తో కలసి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారని వార్తలు వచ్చాయి.
జనసేన పార్టీని ప్రకటించిన పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని కూడా భావించారు. మొత్తానికి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధినేత చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ ఎపుడూ బాబు పవన్ ఇంటికి వెళ్లలేదు. అయితే గత ఏడాది మాత్రం విజయవాడలో ఒక హొటల్ లో ఉన్న పవన్ ను చంద్రబాబు కలసి మంతనాలు జరిపారు.
ఈ మధ్యలో ఎన్నో సార్లు పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అయితే ఇపుడు సడెన్ గా చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లడం మాత్రం సంచలనంగా మారింది. పవన్ యువగళం పాదయాత్ర ముగింపునకు రాను అని చెప్పడంతో ఆయన మనసులో ఏముందో తెలుసుకునేందుకు చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు అని అంటున్నారు.
అంతే కాదు ఈ నెల 20న పవన్ ఆ సభకు అటెండ్ అయ్యేలా చూస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే తన ఇంటికి వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు.మరో వైపు ఉమ్మడి మ్నానిఫేస్టో చర్చించారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అలాగే పొత్తు ద్వారా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది కూడా ఈ చర్చలో వచ్చే వీలుంది. ఏది ఏమైనా ఉమ్మడి మానిఫేస్టో విషయంలో పవన్ పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆయన యాభై సీట్లను పొత్త్లో కోరుతున్నట్లు తెలుసోంది. మరి ఇవన్నీ ఒక కొలిక్కి రావాల్సి ఉన్నాయి. అలాగే తొందరలో రెండు పార్టీల ఉమ్మడి తొలి అభ్యర్ధుల జాబితా కూడా రావాల్సి ఉంది ఇవన్నీ కూడా రెండు పార్టీలకు కీలకంగా మారనున్నాయి.