బాబుకు బీజేపీ ఫుల్ సపోర్ట్...?

ఇదిలా ఉంటే ఏపీలో బాబుకు ఐటీ నోటీసుల మీద మరే పార్టీ మాట్లాడడం లేదు. టీడీపీ అయితే ఫుల్ సైలెంట్ గా ఉంది

Update: 2023-09-07 17:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారు అంటున్నారు. తన మీద దాడులు చేస్తారు అంటున్నారు. తనకు ఏమి జరిగినా భయపడేది లేదు అని చెబుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు నోటి వెంట అరెస్ట్ మాట రావడం అంటే అది రాజకీయంగా సంచలనమే అవుతుంది. ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడి అరెస్ట్ అంత సులువు కాదు కదా అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడం మీద వైసీపీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. జస్ట్ తీగ దొరికింది, డొంక కదలాలి ఉంది అంటున్నారు. వెంటనే ఈడీ రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తోంది. అమరావతి పేరుతో భరీ అవతకతవకలు టీడీపీ హయాంలో సాగాయని చెబుతోంది.

ఇదిలా ఉంటే ఏపీలో బాబుకు ఐటీ నోటీసుల మీద మరే పార్టీ మాట్లాడడం లేదు. టీడీపీ అయితే ఫుల్ సైలెంట్ గా ఉంది. ఈ నేపధ్యంలో అనూహ్యంగా ఏపీ బీజేపీ నేతల నుంచి చంద్రబాబుకు మద్దతు లభిస్తోంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఐటీ నోటీసులు రావడం సర్వసాధారణం అని తేలిగ్గా తీసి పారేశారు.

ఇలాంటి నోటీసులు అందరికీ వస్తూంటాయని ఆమె అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ సైతం బాబు అరెస్ట్ మీద మీడియాతో మాట్లాడుతూ ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తారు. అది జరగదు అని క్లారిటీ ఇచ్చారు. పైగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని, ఆ వైపు నుంచి ఏమైనా జరిగితే జరగాలి తప్ప కేంద్రం నుంచి ఏమీ లేదు ఉండదు అన్నట్లుగా మాట్లాడారు.

ఇలా ఇద్దరు కీలక నేతలు బీజేపీ నుంచి మాట్లాడడం ద్వారా చంద్రబాబుకు పూర్తి మద్దతుగా నిలిచారు అని అంటున్నారు. నిజంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు రావడం అంటే బీజేపీ పెద్దలు కోపంగా ఉన్నారు అని బాబు విషయంలో వారు యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్న వేళ ఏపీ బీజేపీ నేతలు అండగా నిలవడం విశేషం.

మరి కేంద్ర పెద్దల అనుమతితో వారు ఇలా మాట్లాడారా లేక ఏపీలో టీడీపీతో సాన్నిహిత్యం పొత్తులను కోరుకుంటూ అనుకూలంగా మాట్లాడారా అన్నది తెలియదు కానీ ఏపీ బీజేపీ వరకూ అండగానే నిలిచింది. అంతే కాబు బాబును అరెస్ట్ చేయరు అని సత్యకుమార్ చెప్పిన మాటలు కూడా ఏపీ రాజకీయాలలో చర్చకు తావిస్తున్నాయి.

నిజానికి చంద్రబాబు విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు ఎపుడూ సీరియస్ గా ఆలోచించలేదు అని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు తమ గురించి ఘాటైన పదజాలంతో బాబు మాట్లాడినా మోడీ అమిత్ షాలు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని గుర్తు చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల వేళ ఏపీకి వచ్చిన మోడీ పోలవరం చంద్రబాబుకు ఏటీఎం గా మారింది అని తీవ్ర విమర్శలు చేశారు. ఆ తరువాత ఎన్నికలలో బీజేపీ నెగ్గినా మోడీ పోలవరం విషయంలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందా లేదా అన్న దాని మీద విచారణ జరిపించలేదని కూడా గుర్తు చేస్తున్నారు.

ఇక ఐటీ నోటీసుల విషయమే తీసుకుంటే 2022 సెప్టెంబర్ లో తొలి నోటీసును బాబు అందుకున్నారు. ఇప్పటికి ఏడాది గడచింది నాలుగు నోటీసులు మొత్తంగా ఐటీ విభాగం ఇచ్చింది. అయినా బాబుని ఈ విషయంలో ఏమీ చేయలేదు కదా అని కూడా అంటున్నారు. అంటే జస్ట్ నోటీసులు అలా సర్వ్ చేస్తుననరు కానీ ఇదేదో కొంపలు మునిగే విషయం కాదని కూడా అంటున్నారు. ఒకవేళ ఆదాయాన్ని చూపని మొత్తాలు ఉంటే దాని మీద ఐటీ పెనాల్టీ వేసి వసూలు చేస్తుంది తప్ప అరెస్ట్ దాకా ఈ విషయం పోదని అంటున్నారు

అయిఏ అమరావతిలో జరిగిన అనేక రకాలైన స్కాం లతో ముడిపెట్టి లోతైన విచారణ జరిగింతే మాత్రం ఈడీ సీబీఐ రంగంలోకి దిగితేనే అపుడు బాబు అరెస్ట్ అని భావించవచ్చు అని అంటున్నారు. మరి ఇపుడే చంద్రబాబు ఎందుకు అరెస్ట్ అని అంటున్నారు అంటే కేవలం సింపతీ కోసమే అంటున్నారు.

ఇక జాతీయ పార్టీకి చెందిన ఏపీ నాయకులు అరెస్టులు లేవు అని కూడా చెప్పేశాక బాబు బే ఫికర్ గా ఉండొచ్చు అంటున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు కూడా బాబు విషయంలో సానుకూలంగానే ఉన్నట్లుగా పరిస్థితులు చూస్తే కనిపిస్తునాయని అంటున్నారు. మొత్తానికి ఐటీ నోటీసులు అన్నవి టీ కప్పులో తుఫాను మాదిరిగా పక్కకు పోతుందని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News