అంత బాధ నా జీవితంలో పడలేదంటూ బాబు ఎమోషన్ ...!
అందుకే జగన్ని గద్దె దించాలని ఆయన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. ఏపీ నుంచి జగన్ని పంపిస్తేనే శాంతి అని ఆయన అంటున్నారు
టీడీపీ అధినేత అంటే సీరియస్ గానే ఎక్కువ ఫోటోలు కనిపిస్తాయి. బాబు సాడ్ ఫోటో అని ఎవరైనా క్యాప్షన్ కోసం తీయాలంటే మొత్తం గూగుల్ సెర్చ్ చేయాల్సి వస్తుంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గొల్లుమని ఏడ్చిన వీడియోవే ఇపుడు సోషల్ మీడియాలో ఉంటుంది. అలా బాబులోని ఆయన ఏడు పదులు దాటిన జీవితంలోని ఎవరూ చూడాని కోణాన్ని ఆవిష్కరించింది. రెండున్నరేళ్ళ క్రితం ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో తన సతీమణిని వైసీపీ వారు అవమానించారు అంటూ బాబు మీడియా ముందు ఏడుపుతోనే మాట్లాడడం అందరూ చూసారు.
ఇపుడు చంద్రబాబు రా కదలిరా అంటూ జిల్లా టూర్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ మీద విమర్శల జడివాన కురిపిస్తూనే నాడు తనను బాధించిన ఘటనను కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. తన భార్యను వైసీపీ నేతలు అవమానించినపుడు తాను జీవితం మొత్తం మీద అంత బాధ ఎపుడూ పడలేదు అని బాబు ఎమోషన్ అయ్యారు.
చంద్రబాబు సోమవారం చింతలపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ, తన భార్య ఎపుడూ బయటకు రాని వారు అని అలాంటి ఆమె మీద నిందలు వేస్తే తాను ఎంతో ఆవేదన చెందాను అని చెప్పుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఎవరినీ వదలలేదు అని ఆయన మండిపడ్డారు. ఆఖరుకు ఆయన తన తల్లిని చెల్లెలును వదిలిపెట్టలేదు అని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
అందుకే జగన్ని గద్దె దించాలని ఆయన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. ఏపీ నుంచి జగన్ని పంపిస్తేనే శాంతి అని ఆయన అంటున్నారు. జగన్ అర్జునుడు కాదు అక్రమార్జుడు అని చంద్రబాబు సెటైర్లు పేల్చారు. రేపు జగన్ గద్దె దిగి జైలుకు పోతారు కానీ ఆయన చేసిన అప్పులు పన్నెండు లక్షల కోట్లు ఉన్నాయని అవి ఎవరు కడతారు అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ని ఏమి చేయాలని ఆయన చింతలపూడి సభలో ప్రజలను ప్రశ్నించారు. ఏపీ బాగుపడాలి అంటే జగన్ ని అర్జెంటుగా గద్దె దించాలని ఆయన కోరారు. ఆ మీదట ఏపీని అంతా కలసి ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ బాగు చేసుకుందామని బాబు చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రజలకు ఆ శక్తి ఉందని, అలాగే ఏపీని మళ్లీ మొదటి నుంచి పునర్ నిర్మించే శక్తి కూడా తనకు ఉందని చంద్రబాబు అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు చింతలపూడి సభలో ఎన్నడూ లేని విధంగా జగన్ మీద పరుష వ్యాఖ్యలు చేశారు. జగన్ ని పట్టుకుని చాలా తీవ్ర వ్యాఖ్యలే చేసారు.