ఏపీలో మహిళలకు మరో గుడ్ న్యూస్... బాబు కీలక ప్రకటన!

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోంది

Update: 2024-07-13 12:50 GMT

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రియారిటీ బేస్డ్ గా ఒక్కొక్కటీ చేసుకుంటూ వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజుల్లోపే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెన్షన్ పెంచి అందించగా.. మెగా డీఎస్సీ, అన్న క్యాంటీలు, ఉచిత ఇసుక పథకాలు ముందుకు కదిలాయి. ఇదే సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవో విడుదలవ్వగా.. త్వరలో మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి.

త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా నెరవేర్చే అవాకాలున్నాయని అంటున్నారు. ఇటీవల తెలంగాణ సీఎంతో భేటీ అయిన సమయంలో.. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఈ పథకం గురించి బాబు చర్చించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు. ఇది డ్వాక్రా మహిళలకు కావడం గమనార్హం!

అవును... ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటిలో కొన్ని కొత్త పథకాలు కాగా.. మరికొన్ని పథకాలు టీడీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఇంతక ముందు అమలుచేసినవే! ఈ పథకాల అమలుల్లో సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా... వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాన్ని మహిళలకు మంజూరు చేయబోతున్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకే ఈ రుణాన్ని అందజేయనున్నారు. ఈ క్రమంలో వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు మరో పథకం కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ‘ఆడబిడ్డ’ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు రూ.1500 త్వరలో అందించబోతోందని తెలుస్తోంది. బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటి.

Tags:    

Similar News