జగన్ తో పంచాయతీ అంటున్న బాబు
చంద్రబాబు రాజకీయం ఎన్నికల వేళ పదునెక్కుతోంది. జగన్ని గద్దె దించడానికి ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకోవడంలేదు.
చంద్రబాబు రాజకీయం ఎన్నికల వేళ పదునెక్కుతోంది. జగన్ని గద్దె దించడానికి ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకోవడంలేదు. అదే విధంగా జగన్ కి దెబ్బ కొట్టే ఏ వర్గం ఓటర్లను దూరం చేసుకోదలచుకోవడంలేదు. ఇప్పటిదాకా ఒక అంచనా అయితే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద ఉంది.
పట్టణాలు నగరాల్లో విపక్షానిది పై చేయిగా ఉంటే గ్రామాలు పల్లెలలలో వైసీపీకి అనుకూలంగా ఉంది అని. అందుకే చంద్రబాబు పట్టణ నగర ఓటర్లను ఒక వైపు తిప్పుకునేలా కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధి నినాదాలు ఇస్తున్నారు. వైసీపీ పాలనను ఎండగడుతున్నారు.
అయితే పల్లెలలో ఉన్న వైసీపీ బలం పెళ్ళగించడానికి ఆయన చూస్తున్నారు. అందుకోసం పంచాయతీలు కేంద్రంగా సరికొత్త రాజకీయ ఉద్యమానికి ఆయన రెడీ అవుతున్నారు. పంచాయతీఅలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు రాజ్యాంగం ప్రకారం వారికి వచ్చే నిధుల విషయంలో అడ్డుపడిపోతోంది అన్న చర్చ ఉంది.
పంచాయతీ సర్పంచులలో అధిక భాగం వైసీపీ వారే ఉన్నా వారికి నిధులు విధులు లేకపోవడం వల్ల వారంతా ఇపుడు మండిపోతున్నారు. తాను ఎందుకు ఎన్నిక అయినట్లు అన్నది వారికే అర్ధం కావడం లేదు అంటున్నారు. మరో వైపు చూస్తే ఇటీవల విజయవాడలో వామపక్షాలు పంచాయతీ సర్పంచుల సమస్యల మీద రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహిస్తే వైసీపీ సర్పంచులు కూడా అటెండ్ కావడం వారిలో రగులుకున్న ఆవేశాన్ని తెలియచేస్తోంది.
అందుకే దానిని సరిగ్గా పట్టుకుని బాబు భారీ ప్లాన్ ని రెడీ చేశారు అని అంటున్నారు. పంచాయతీ సర్పంచుల సమస్యల మీద అన్ని పార్టీలతో ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని రూపొందించడం ద్వారా వారినీ ఆ మీదట గ్రామ ప్రజలను తిప్పుకోవచ్చు అన్నదే బాబు ఆలోచన అంటున్నారు పంచాయతీలకు రోడ్లు వేయాలంటే డబ్బులు లేవు, వీధి దీపాలు వేయడానికి అవకాశం లేదు. కాలువలలో పూడిక తీయలేకపోతున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా లేని పరిస్థితి.
దాని వల్ల పంచాయతీలలో ప్రజలు కూడా విసుక్కుంటున్నారు. అలా ప్రజలలో ఉన్న కోపాన్ని వైసీపీ మీద మళ్ళించడానికి ఇది ఉపయోగపడుతుంది అని టీడీపీ భారీ ప్లాన్ తో ఉంది. ఇక వాలంటీర్లు మధ్యన దూరి సర్పంచుల కంటే కూడా ఎక్కువ అయిపోయారు అన్నది సరికొత్త ఆరోపణగా ఉంది.
అలా వారిలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టి మరీ సర్పంచులని తమ వైపునకు తిప్పుకుంటే గ్రామీణ రాజకీయం తమ పరం అవుతుంది అన్నది టీడీపీ ఆలోచన. ఇదిలా ఉంటే వాలంటీర్లకు అయిదువేలు, పంచాయతీ సర్పచులకు మూడు వేలా అన్న వాదన కూడా టీడీపీ ముందుకు తెస్తోంది. మొత్తానికి జగన్ కి ఉన్న రూరల్ ఏరియా బేస్ కి భారీ దెబ్బ కొట్టడానికే ఈ రకమైన ఎత్తుగడతో టీడీపీ ముందుకు వస్తోంది అని అంటున్నారు.