నయా ట్రెండ్: ఒంటరి అమ్మాయిలు ఫేక్ బేబి బంప్?
వీటిలో యువతులు, ఒంటరి మహిళలు ప్రసూతి ఫోటోలు తీసి పోస్ట్ చేయడానికి నకిలీ గర్భాన్ని ధరించారు.
యవ్వనంలో ఉన్న అమ్మాయిల్లో ఫేకింగ్ బేబి బంప్ వైరల్ చేయడం నేటి ట్రెండ్. ఒంటరి మహిళలు ఈ విధానంపై ఎక్కువగా ఆసక్తి చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఫేక్ బేబి బంప్ ల ఫోటోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. వీటిలో యువతులు, ఒంటరి మహిళలు ప్రసూతి ఫోటోలు తీసి పోస్ట్ చేయడానికి నకిలీ గర్భాన్ని ధరించారు.
అయితే ఇది భారతదేశంలో కాదు.. మన పొరుగున ఉన్న దాయాది దేశం చైనాలో. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ఈ ధోరణి సాంప్రదాయ చైనీస్ నమ్మకాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఇది ఒంటరి మహిళల గర్భాల పేరుతో దేశానికి కళంకం తెస్తోందని సదరు పత్రిక పేర్కొంది. ఈ ధోరణి పెరుగుదలకు కారణాన్ని కూడా సదరు పత్రిక వెల్లడించింది. చైనాలో ఇటీవల జనన, వివాహాల రేట్లు పడిపోయాయని తెలిపింది. ఇది దేశంలో అత్యయిక పరిస్థితికి అలారం వంటిది అని సదరు పత్రిక ఆందోళన చెందింది.
చైనీ అమ్మాయిలు ఫేక్ బెల్లీస్ ట్రెండ్‌లో భాగంగా ప్రీ సెట్ ఫోటోషూట్ వ్యామోహంతో వ్యవహరిస్తున్నారు. మహిళలు చిన్న వయస్సులోనే జీవితంలో ముఖ్యమైన మూవ్‌మెంట్స్ కి సంబంధించిన జ్ఞాపకాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గర్భధారణ సమయంలో భవిష్యత్తులో జరిగే శరీర మార్పులను ఊహించి వారి ప్రస్తుత శరీరాల సైజును పెంచుతూ అందమైన ప్రసూతి ఫోటోలను తీసి దాచుకుంటున్నారు.
సెంట్రల్ చైనీస్ ప్రావిన్స్ హునాన్ నుండి జెన్ Z ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన `మీజీ గీజ్` ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఒక వీడియో ప్రీమేడ్ మెటర్నిటీ ఫోటోల ట్రెండ్‌కి జాతీయ స్థాయిలో ప్రచారం తెచ్చిపెట్టింది. అక్టోబరు 13న ప్రసూతి ఫోటో షూట్ నుండి వైవిధ్యమైన ఫోటోలను పోస్ట్ చేసిన ఒక యువతి ఈ వీడియోలో చాలా ఆనందం వ్యక్తం చేసింది. ``నేను ఇంకా స్లిమ్‌గా ఉన్నా కానీ.. ప్రసూతి ఫోటోలు తీయడానికి నకిలీ బొడ్డును ధరించాను.. ప్రీ-మేడ్ జీవితాన్ని ఆస్వాదించాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి ఇదంతా చేసాను! `` అని ఆ యువతి తెలిపింది. నకిలీ బొడ్డు ధరించేందుకు మరొకరి సాయం తీసుకోవడం వీడియోలో కనిపించింది.
ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ, ``నేను కొత్త విషయం నేర్చుకున్నాను. స్లిమ్‌గా ఉన్నప్పుడే నకిలీ బొడ్డు కొని ప్రసూతి ఫోటోలు తీసుకుంటాను`` అని అన్నారు. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్ 23 సంవత్సరాల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసానని పేర్కొంది. 22 సంవత్సరాల వయస్సులో పెళ్లి ఫోటోలు, 30 ఏళ్లలోపు ముడతలు వచ్చినట్టు కనిపించే ఫోటోలను తీసుకున్నట్టు తెలిపింది. మరొకరు నా 70వ పుట్టినరోజు ఫోటోలను ఇప్పుడే షూట్ చేస్తాను.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని టీజ్ చేసాడు.
నేను చనిపోయే ముందు నా అంత్యక్రియల ఫోటోలను ఏర్పాటు చేయడానికి ముందే ఫోటోలు రెడీ చేసుకుంటానని ఒక నెటిజన్ వ్యాఖ్యానించింది. నేను చిన్న వయస్సులో ఉన్న ఫోటోలు తీసి, పెద్దయ్యాక వాటిని ఆన్‌లైన్ డేటింగ్ కోసం ఉపయోగించగలను.. అని ఒకరు రాసారు. గర్భిణీ స్త్రీలు యవ్వనంగా, స్లిమ్‌గా ఉండాలనే ఆలోచనను ఈ ఫోటోలు తెలియజేస్తాయని విమర్శకులు పేర్కొన్నారు.