అద్భుతం... ప్రపంచంలో 0.3శాతం మందికి మాత్రమే ఇలా జరుగుతుంది!

చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్కడ మీడియా ప్రత్యేకంగా హైలెట్ చేసింది.

Update: 2024-09-29 01:30 GMT

చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్కడ మీడియా ప్రత్యేకంగా హైలెట్ చేసింది. ఇందులో అంత హైలెట్ చేయడానికి ఏముంది అని అనుకుంటే పొరపాటే సుమా! ఎందుకంటే... ప్రపంచంలో కేవలం 0.3 శాతం మంది మహిళలకు మాత్రమే ఉండే అరుదైన పరిస్థితిలో ఆమె కవలలకు జన్మనిచ్చింది.

అవును... దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం... ఆ దేశంలోని వాయువ్య ప్రాంతానికి చెందిన ఓ మహిళ సెప్టెంబరు లో కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు రెండు గర్భాశయాలు ఉండగా.. ఈ కవలలు ఒక్కొక్కరూ వేర్వేరు గర్భాల నుంచి జన్మించారు. వీరిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి.

యుటెరస్ డిడెల్ఫిస్ అని పిలవబడే ఆమె పరిస్థితి చాలా అరుదైనదని.. సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో పిండం అభివృద్ధి చెందడం చాలా అరుదని చెబుతున్నారు. ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతిగా ఉన్నప్పుడు షాంగ్సీ ప్రావిన్స్ లోని ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చారు. వైద్యులు ఈ కేసును మిలియన్ లలో ఒక విషయంగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆసుపత్రి వైద్యుడు కాయ్ యింగ్... సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో గర్భవతి కావడం చాలా అరుదని.. తాము చైనా, విదేశాల నుంచి ఇటువంటి రెండు కేసుల గురించి మాత్రమే విన్నట్లు తెలిపారు. ఈ పరిస్థిలో ఉన్న మహిళలు గర్భస్రావం, ముందస్తు జననం వంటి సవాళ్లను ఎదుర్కొంటారని అన్నారు.

ఇక తాజాగా ఆమె కవలలను సిజేరియన్ ద్వా రా ప్రసవించింది. ఈ సమయంలో అబ్బాయి బరువు 3.3 కిలోలు, అమ్మాయి బరువు 2.4 కిలోల బరువు ఉన్నారని.. ఇద్దరూ ఆరోగ్యంగానే జన్మించారని చెబుతున్నారు.

Tags:    

Similar News